బాబుపైకి మరో అస్త్రాన్ని సంధించినున్న జగన్!

Updated By VankayaTue, 04/17/2018 - 11:40
Jagan Plans Mighty Blow For Babu

ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును ముప్పుతిప్పలు పెడుతున్నాడు. జగన్ రాజకీయ వ్యూహాలతో చంద్రబాబు కంగుతింటున్నాడు. చేసేది లేక రాజకీయ వ్యూహాల్లో కూడా చంద్రబాబు జగన్ ను అనుకరించాల్సి వస్తోంది. జగన్ చెప్పిన విషయాలను మొదట ఎద్దేవా చేసే చంద్రబాబు చివరకు మాత్రం జగన్ చెప్పినట్టుగానే చేస్తున్నాడు. అంతకు మించి చంద్రబాబుకు వేరే మార్గం లేకుండా పోతోంది. నలభై యేళ్ల అనుభవం అంటూ చెప్పుకునే చంద్రబాబు, చివరకు నలభై ఐదేళ్ల జగన్ చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాడు. 

ఇక జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే తన పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయించాడు. ఆ రాజీనామాలు గనుక ఆమోదం పొందితే చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తాయి. ప్రత్యేకహోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తే.. తెలుగుదేశం వాళ్లు మాత్రం ఆ పని చేయలేదు.. అనే ప్రచారం ఊపందుకుంటోంది ఇప్పటికే. ఇలా ఎంపీల రాజీనామాలతో వైసీపీ అధినేత చంద్రబాబును ఇరకాటంలో పెడితే, ఇప్పుడు మూకుమ్మడి రాజీనామాల అస్త్రాన్ని సంధించనున్నాడట జగన్ మోహన్ రెడ్డి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనికి ముహూర్తం కూడా కుదిరినట్టు సమాచారం. జూన్ నెల మొదటి వారంలో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రత్యేకహోదా పోరాటం, చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. జూన్ కళ్లా జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కూడా ముగింపు దశకు వస్తుంది.  ఆ సమయానికి కూడా ప్రత్యేకహోదా వేడి ఏమీ తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అప్పుడు ఎమ్మెల్యేలందరి చేతా రాజీనామాలు చేయించి.. జగన్ మోహన్ రెడ్డి బాబును మరింత ఇరకాటంలో పెట్టనున్నట్టుగా తెలుస్తోంది.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం, ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ రాజీనామాలు అనే అస్త్రంలో ప్రజల్లోకి వెళ్లి బాబును మరింత ఇరకాటంలోకి నెట్టడానికి వైసీపీ అధినేత వ్యూహం రచించినట్టుగా సమాచారం.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE