జనసేన గందరగోళ ప్రయాణానికి ఇదో రుజువు..!

Updated By VankayaMon, 04/16/2018 - 16:39
janasena pawan

ఆది నుంచి పవన్ కల్యాణ్ రాజకీయంలో గందరగోళమే కనిపిస్తోంది తప్ప.. అంతకు మించిన స్పష్టత అయితే కనిపించడం లేదు. ప్రజారాజ్యం పార్టీ విలీనం అప్పుడు ఏం మాట్లాడని పవన్ కల్యాణ్, ఆ తర్వాత జనసేన అంటూ వచ్చి ఇష్టానుసారం మాట్లాడాడు. అందరికీ నీతులు చెప్ప సాగాడు. ఇక అలా అయినా తన పార్టీ తరఫున పని చేశాడా? అంటే అలాంటిదేమీ లేదు. మళ్లీ ఈ పార్టీతో బీజేపీ, టీడీపీలకు మద్దతు అన్నాడు. వాళ్లను కూడా ప్రశ్నిస్తా అన్నాడు. ఇక నాలుగేళ్ల నుంచి పీకే చేసిన పనేంటో అందరికీ తెలిసిందే. ఇక మళ్లీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీ అని ప్రకటించాడు.

తన పార్టీ తరఫున పోటీ అన్నాడు. తన పార్టీ తరఫున వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉంటారని ప్రకటించాడు. అలాగని అన్ని నియోజకవర్గాల్లోనూ కాదు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ. అదెక్కడో ఇంకా స్పష్టత లేదు. ఒకవైపు తనకు ఏ కులం లేదని అనే పవన్ కల్యాణ్.. తన కుల ప్రాబల్యం ఉండే చోట్లలో మాత్రమే పోటీ చేసే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. అయితే ఆ అంశంపై కూడా ఇంకా స్పష్టత లేదు. పవన్ పార్టీలోకి నేతల చేరిక కనిపించడం లేదు. ఇప్పటికే అనేక మందిని సంప్రదించినా, ఇంకా ఎవరూ చేరతామనే సంకేతాలను గట్టిగా ఇవ్వలేదని తెలుస్తోంది.

ఇక ఇప్పుడు మరో అంశం ఏమిటంటే.. ఆ మధ్య కమ్యూనిస్టు పార్టీ నేత రామకఈష్ణ మాట్లాడుతూ, ఈ నెల 15,16 వ తేదీల్లో తమ పార్టీ అనంతపురంలో సభ నిర్వహిస్తుందని, ఆ సభకు పవన్ కల్యాణ్ వస్తాడని ప్రకటించాడు. దాదాపు పక్షం రోజుల కిందటే ఈ ప్రకటన చేశారు. అయితే ఈ నెలలో 15,16వ తేదీలు గడిచిపోతున్నా.. అనంతలో పవన్ సభ గురించి క్లారిటీ లేదు. ప్రస్తుతానికి జనసేన, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పని చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ తరఫున కమ్యూనిస్టులు ఆ ప్రకటన చేశారు. అయితే అటు ఆ సభా జరగలేదు, ఇటు పవన్ కల్యాణ్ అనంతపురం రానూ రాలేదు.

ఈ సభ వాయిదా పడిందనో, మళ్లీ నిర్వహిస్తామనో.. ఒక ప్రకటన కూడా చేయలేదు. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ తిరుపతికి వెళ్తున్నాడట. ఈ నెలాఖరులో అంటున్నారు. మరి ఆ కార్యక్రమం అయినా జరుగుతుందో లేదో చూడాలిక.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE