కేసీఆర్ మాటే అస‌ద్ మాట‌!

Updated By VankayaMon, 04/16/2018 - 17:45
 Karnataka polls: AIMIM chief Asaduddin Owaisi announces support for JDS

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు.. మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీకి మ‌ధ్య‌నున్న అనుబంధం గురించి తెలిసిందే. అధికార‌ప‌క్షానికి ఆప్త‌మిత్రుడిగా.. న‌మ్మిన‌బంటుగా వ్య‌వ‌హ‌రించే అస‌ద్‌.. తాజాగా అదే పంథాను ప్ర‌ద‌ర్శించారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు సంబంధించి అసద్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

క‌ర్ణాట‌క అసెంబ్లీకి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో తాము పోటీ చేయ‌మ‌న్న ఆయ‌న‌.. క‌ర్ణాట‌క‌లో దేవ‌గౌడ్ కు చెంది జేడీఎస్ కు ఓటు వేయాల‌ని మైనార్టీల‌కు పిలుపునిచ్చారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఈ మ‌ధ్య‌న క‌ర్ణాట‌క‌కు వెళ్లిన కేసీఆర్‌.. దేవ‌గౌడ‌కు అవుట్ అండ్ అవుట్ స‌పోర్ట్ ప్ర‌క‌టించ‌ట‌మే కాదు.. క‌ర్ణాక‌ట‌లోని తెలుగువాళ్లంతా గంప‌గుత్త‌గా జేడీఎస్ కు ఓటు వేయాల‌ని చెప్ప‌టం తెలిసిందే. 

తాజాగా అస‌ద్ సైతం అదే బాట‌లో న‌డుస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. తాము జేడీఎస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. క‌ర్ణాట‌క‌లో రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్.. బీజేపీ) పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని.. అభివృద్ధి జ‌ర‌గాలంటే కాంగ్రెస్.. బీజేపీయేత‌ర ప్ర‌భుత్వం రావాల‌ని అందుకే జేడీఎస్ కు పూర్తి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని మ‌జ్లిస్ నిర్ణ‌యించింద‌ని పేర్కొన్నారు. 

ఏదో మాట వ‌ర‌స‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌టం కాకుండా.. జేడీఎస్ త‌ర‌ఫున తాము ప్ర‌చారాన్ని నిర్వహిస్తామ‌ని.. అవ‌స‌ర‌మైతే జేడీఎస్ త‌ర‌ఫున బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేస్తామ‌ని అస‌ద్ ప్ర‌క‌టించ‌టం గ‌మ‌నార్హం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇటీవ‌ల కాలంలో త‌మ పార్టీని విస్త‌రించే ప‌నిలో భాగంగా ఇప్ప‌టికే ఎన్నిక‌లు నిర్వ‌హించిన వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసిన మ‌జ్లిస్.. క‌ర్ణాట‌క‌లో మాత్రం పోటీకి దిగ‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు మిత్ర‌ప‌క్షంలో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చినా ఫైన‌ల్ గా మాత్రం పోటీకి మొగ్గు చూప‌కుండా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని డిసైడ్ కావ‌టం గ‌మానార్హం. కేసీఆర్ చెప్పిన‌ట్లే చెప్పిన‌ట్లే జేడీఎస్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన అస‌ద్ మాట‌ను ఎంత‌మంది ముస్లింలు ఓటు వేస్తారో చూడాలి. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE