కేసీఆర్ ను డూప్ ని చేసేసిన కిషన్ రెడ్డి!

Updated By VankayaWed, 02/14/2018 - 10:25
Kishan reddy comments on KCR

కేసీఆర్ ను ఇన్నాళ్లూ టీఆర్ఎస్ ఏతర పార్టీలు రకరకాలుగా తిట్టిపోస్తూనే ఉన్నాయి కానీ.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాత్రం.. కాస్త వెరైటీగా తిట్టి ప్రత్యేకత చూపించుకున్నారు. కేసీఆర్ అట.. కేంద్రంతో డూప్ ఫైటింగ్ చేస్తున్నారట. ఈ మాటను ఎందుకు అనాల్సి వచ్చిందో.. అసలు ఏ ఉద్దేశంతో అన్నారో కానీ.. కేసీఆర్ నైతే కిషన్ రెడ్డి ఈ మాట అనేశారు. ఎవరు ఎంతగా మాట్లాడినా.. డూప్ అన్న మాటను మాత్రం కాస్త ఆలోచించాల్సిందే అని ఇతర పార్టీల నేతలు కూడా పట్టి పట్టి చూస్తున్నారు.

ఎందుకంటే.. ఇన్నాళ్లూ బీజేపీతో టీఆర్ఎస్ కు రహస్య స్నేహం ఉందనీ.. అందుకే పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయకుండా ఆ పార్టీ ఎంపీలు మౌనంగా ఉంటున్నారని విమర్శలు ఉన్నాయి. పైగా.. గతంలో కేంద్ర కార్మిక మంత్రిగా పని చేసినపుడు జరిగిన వ్యవహారాలకు సంబంధించి కేసీఆర్ పై సీబీఐ కేసులు ఉన్నాయని.. అందుకే కేంద్రంతో అనధికారికంగా టీఆర్ఎస్ వాళ్లు సన్నిహితంగా మెలుగుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు.. కిషన్ రెడ్డి చేసిన ఈ డూప్ కామెంట్లు కూడా.. ఇందుకు కాస్త దగ్గరగా కనిపిస్తున్నాయి.

కాకపోతే.. ఇతర పార్టీలు తిట్టినంత డైరెక్ట్ గా కాకపోయినా.. కిషన్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ పై ఉన్న అసహనాన్ని ఇలా బయటపెట్టుకున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వచ్చేఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందాలంటే.. ఇలా ఒకరికొకరు డూప్ పోరాటాలు చేసుకుంటూ.. రాజకీయంగా ఓ అవగాహనకు రావొచ్చన్నది కూడా.. తెర వెనక వ్యూహమై ఉంటుందన్న అభిప్రాయం కూడా కిషన్ రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలపై వినిపిస్తోంది.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE