ప‌వన్ ను చూస్తే నవ్వొస్తుంది

Updated By VankayaTue, 02/13/2018 - 17:53
Kishan reddy comments on pawan kalyan

ప్రాంతంతో సంబంధం లేకుండా బీజేపీ నేత‌లు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను తిట్టిపోస్తున్నారు రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింద‌ని వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. టీడీపీ కేంద్రం అడిగిన నిధులు ఎక్క‌డ ఎంత ఖ‌ర్చుపెట్టారో చెప్ప‌లేక గుడ్లు తేలేస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కేంద్రం ఇచ్చిన నిధుల‌పై అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ నానా హ‌డావిడి చేస్తున్నారు. 

ఈ నేప‌థ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే కిష‌న్ రెడ్డి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు యాక్టింగ్ రాద‌ని ఎద్దేవా చేశారు. పాలిటిక్స్ చేయ‌డం రాద‌ని న‌ట‌న‌లో అన్న చిరంజీవిని అడ్డంపెట్టుకొని స్టార్ అయ్యాడ‌ని లేదంటే మాములుగా ఉండేవాడ‌ని అన్నారు ఒక్కోసారి ప‌వ‌న్ న‌ట‌న చూసి న‌వ్వొంస్తుంద‌న్నారు. 

ప‌నిలో ప‌నిగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు కిష‌న్ రెడ్డి. కాంగ్రెస్ లో ఒక‌రిపై ఒక‌రు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసుకున్న‌ట్లు బీజేపీలో చేయ‌డం కుద‌ర‌ద‌ని అన్నారు రేవంత్ త‌మ‌పార్టీలోకి వ‌చ్చినా క్ర‌మ‌శిక్ష‌ణ త‌ట్టుకోలేక వెళ్లి పోయేవార‌ని సూచించారు. 

2019 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న చేస్తార‌ని చెప్పుకొచ్చారు. కాగా కిష‌న్ రెడ్డి వ్యాఖ్య‌లు అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణ‌లో మంట‌పుట్టిస్తున్నాయి గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ద‌తిచ్చిన ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తుండ‌డం మ‌రోవైపు బీజేపీని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే కిష‌న్ రెడ్డి ప‌వ‌న్ పై చేసిన విమ‌ర్శ‌లు జ‌న‌సేన - బీజేపీ లు క‌ల‌వ‌డం అనేది క‌ష్ట‌మేన‌ని అంటున్నారు పొలిటిక‌ల్ క్రిటిక్స్ .  
 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE