ఇంత పైరసీనా కృష్ణ కృష్ణా

Updated By VankayaMon, 04/16/2018 - 13:17
krishnarjuna Yuddham Pyracy Show

పైకి ఎన్ని కబుర్లు చెప్పుకున్నా సినిమా పరిశ్రమను తీవ్రంగా దెబ్బ తీస్తున్న పైరసీ మూలాలను అరికట్టాలంటే కఠిన చర్యలు అవసరం. అది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సైబర్ క్రైమ్ డిపార్టుమెంటు ఆధీనంలో ఉంటుంది. కాని ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు. పక్కన కోలీవుడ్ లో కొంత నయం. అక్కడ పైరసీ ఇంకా దారుణంగా ఉన్నా విశాల్ లాంటి హీరోలు దాన్ని అరికట్టేందుకు గట్టిగా నడుం బిగించారు.

ఇక్కడ విచారకరమైన విషయం ప్రభుత్వ రంగ సంస్థలే ఇప్పుడు పైరసీ భూతానికి ఊతమివ్వడం. నాని డ్యూయల్ రోల్ లో నటించిన కృష్ణార్జున యుద్ధం విడుదలై ఈ రోజుకి నాలుగు రోజులు మాత్రమే అయ్యింది. టాక్ ఎలా ఉన్నా వీక్ ఎండ్ ప్లస్ హాలిడేస్ తో వసూళ్ళ విషయం పర్వాలేదు అనే రీతిలో సాగుతోంది.

మహా మహా సినిమాలకే పైరసీ దెబ్బ తప్పలేదు. ఇదెంత అనుకున్నారేమో దీని ప్రింట్ కూడా ఆన్ లైన్ లో పెట్టారు. నిన్న బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న తెలంగాణా ఆర్టిసి బస్సు  వీడియో ప్రదర్శనలో ఏకంగా కృష్ణార్జున యుద్ధం వేసేసారు. షాక్ అయిన ఓ ప్రేక్షకుడు వెంటనే ఐటి శాఖ మంత్రి కేటిఆర్ కు ట్వీట్ చేస్తూ మెసేజ్ పెట్టడం కలకలం రేపుతోంది. ప్రైవేట్ బస్ అంటే ఉద్దేశపూర్వకంగా అనుకోవచ్చు కాని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఈ విధంగా చేయటం క్షమించరాని నేరం.

మూడు రోజులకే ఇలా కొత్త సినిమాలు బస్సులో వేస్తే ఇక వాటి ప్రభావం కలెక్షన్ల మీద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా. ఇప్పుడు అదే జరుగుతోంది. యాజమాన్యం మాత్రం ఇది కాంట్రాక్టర్ చేసిన తప్పేనని తమకు సినిమాలకు బాద్యత ఉండదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు టాక్. ఇలా అయితే ఇంకో పాతికేళ్ళు గడిచినా పైరసీ రూపం మారుతుందే తప్ప పూర్తిగా అంతం కాదు.

Pyracy Show

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE