రేవ‌ణ్ణ వ్యాఖ్య‌ల‌తో మోడీషాల‌కు భారీ షాకే!

Updated By VankayaWed, 05/16/2018 - 19:37
Kumaraswamy to become CM, says Deve Gowda’s elder son HD Revanna

క‌ర్ణాట‌క రాజ‌కీయాల్ని లోతుగా చూసే వారికి  త‌ప్పించి.. మామూలు వారికి దేవెగౌడ మ‌రో కుమారుడు రేవ‌ణ్ణ గురించి తెలీదు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు త్రిశుంక స్వ‌ర్గంగా మారి బీజేపీకి అధికారం అంద‌ని ద్రాక్ష‌గా మారుతుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఇలాంటివేళ‌.. రేవ‌ణ్ణ పేరును అనూహ్యంగా తెర మీద‌కు వ‌చ్చింది. కాంగ్రెస్.. జేడీఎస్ కాంబినేష‌న్లో క‌ర్ణాట‌క‌లో స‌ర్కారు ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న చేస్తే.. దానికి చెక్ పెట్టేందుకు వీలుగా దేవెగౌడ మ‌రో కుమారుడు రేవ‌ణ్ణ సాయంతో జేడీఎస్ లో చీలిక తేనున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. రేవ‌ణ్ణ‌ను కాంట్రాక్ట్ చేసిన బీజేపీ నేత‌లు ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని.. ఇందుకు ప్ర‌తిగా 12 మంది ఎమ్మెల్యేల్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చే బాధ్య‌త‌ను అప్ప‌గించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. ఇలాంటి వార్త‌ల‌కు..చీలిక ఊహాగానాల‌కు చెక్ చెబుతూ.. క‌మ‌లనాథుల‌కు క‌రెంట్ షాక్ కొట్టేలా చేశారు రేవ‌ణ్ణ‌. త‌న మీద వ‌స్తున్న వార్త‌ల‌కు పుల్ స్టాప్ పెట్టేలా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న త‌మ్ముడు కుమార‌స్వామిని జేడీఎస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎన్నుకున్న విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు. దీంతో.. రేవ‌ణ్ణ బీజేపీ నేత‌ల‌తో చేతులు క‌లిపార‌న్న వార్త‌లు నిజం లేద‌ని తేలిపోయింది.

అంతేకాదు.. జేడీఎస్ శాస‌న‌స‌భాప‌క్షంతో భేటీ అనంత‌రం కుమార‌స్వామితో క‌లిసి రేవ‌ణ్ణ విలేక‌రుల‌తో మాట్లాడారు. దీంతో.. రేవ‌ణ్ణ సాయంతో జేడీఎస్ లో చీలిక తెచ్చి బీజేపీ నేత‌లు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉందంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. అవ‌న్నీ త‌ప్ప‌న్న విష‌యాలు తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో స్ప‌ష్ట‌మైంద‌ని చెప్పాలి.  


 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE