రోమ్‌నగరం తగల బడుతుంటే పిడేలు వాయిస్తున్నారే

Updated By VankayaWed, 05/16/2018 - 19:45
At least 18 killed as under-construction flyover collapses in Varanasi

రోమ్‌నగరం తగలబడుతుంటే పిడేలు వాయించినట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఓ వైపు సామాన్యులు ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయి నిరాశ్ర‌యులైతే ఓ వైపు నేత‌లు రాజ‌కీయం చేస్తున్నారు.

ప్ర‌ఖ్యాత ఆథ్యాత్మిక న‌గ‌రం వార‌ణాసిలో ఫ్లైఓవ‌ర్ కూలింది. ఈ ఘ‌ట‌న‌లో నాలుగు కార్లు, ఒక ఆటో, ఒక మినీ బస్సుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే దీన్ని రాజ‌కీయం చేసేందుకు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

ఫ్లైఓవ‌ర్ ఘ‌ట‌న‌లో బాధితుల్ని ప‌రామ‌ర్శించిన యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజ్‌ బబ్బర్ దేవుడి శాపం వ‌ల్లే ఈ దారుణం జ‌రిగింది. మొన్న జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ముందే ప్లైఓవ‌ర్ నిర్మించాల‌ని మూడు వినాయ‌కుడి ఆల‌యాల్ని ధ్వంసం చేశార‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్న‌ట్లు చెప్పారు.    

బ్రిడ్జి కోసం వాటని ధ్వంసం చేశారని, ఆ శాపం వల్ల ఇంతటి విపత్తు సంభవించిందని వారు భావిస్తున్నారు అని రాజ్‌ బబ్బర్ సూచించారు. మ‌రోవైపు ఫ్లైఓవ‌ర్ నిర్మాణ సంస్థ‌కు చెందిన  స్టేట్‌ బ్రిడ్జ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌పై ప‌లు కేసులు న‌మోదు అయ్యాయి. ఇందులో భాగ‌స్వాములైన అధికారులు స‌స్పెండ్ చేస్తుంది అక్క‌డి ప్ర‌భుత్వం.  

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE