వాయులింగ క్షేత్రమే ఈ శ్రీకాళహస్తి

Updated By VankayaMon, 04/16/2018 - 15:49
Lord Siva as Vayu Lingam in Srikalahasti

ద‌క్షిణ కాశీ అని పిల‌వ‌బ‌డే శ్రీకాళ‌హ‌స్తి గొప్ప శైవ క్షేత్ర‌ము. ఆంధ్ర‌ప్ర‌దేశ్ చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున కొలువై ఉంది. పంచభూతలింగములలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రాన్నిశ్రీకృష్ణ దేవ‌రాయులు భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా ఉన్న విశ్వబ్రాహ్మణ శిల్పక‌ళాకారుల‌తో నిర్మించారు.
శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది. వాయువంతటి గొప్పక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత. ఈ క్షేత్రంలో పరమశివుడే కైలాసగిరులుగా వెలిశాడు.

గుడి గర్భాలయంలోని శ్రీకాళహస్తీశ్వర, జ్ఞాన ప్రసూనాంబలు కొలువై ఉన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది.  వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున కొలువై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారం చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. ఉత్త‌రాన గణపతి, తూర్పున జ్ఞాన ప్రసూనాంబ అమ్మ‌వారు, పశ్చిమాన‌ కాళ హస్తీశ్వరుడు,ద‌క్షిణాన‌ దక్షిణామూర్తి గాను ఉన్నారు.

ఈ దేవ‌ల‌యాన్నితుళువ నరసనాయకుని మూడవ కుమారుడు  విజయనగర సామ్రాజ్య చ‌క్ర‌వ‌ర్తి శ్రీకృష్ణదేవరాయలు క‌ళంకారీ క‌ళ‌కు పుట్టినిల్లుగా ఉండేందుకు కృషి చేశారు.  దేవాల‌యంలో  రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా, విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కాణాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణ‌గా నిలుస్తుంది.  

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE