తోకలు పెరిగిన ఆ హీరొయిన్లు ఎవరు ?

Updated By VankayaWed, 02/14/2018 - 11:13
MAA President Sivaji Raja Strong Warning to Star Heroines

నటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజాకి కోపం వచ్చింది. ఎవరిమీదో ఖచ్చితంగా అర్థం కాలేదు కాని రాజు గారు మాత్రం గరం గరంగా ఉన్నారు అనేది అర్థమైంది. మా సంఘం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ త్వరలో ఘనంగా నిర్వహించబోతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో కొందరు హీరొయిన్లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తొలుత అమెరికాలో జరగబోయే ఈవెంట్ గురించి మాట్లాడిన శివాజీ రాజా తమ పూర్తి సహకారం అందించిన చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు ఇలా అందరి గురించి పేరు పేరునా థాంక్స్ చెబుతూ ప్రసంగం కొనసాగించిన తర్వాత మెల్లగా రూట్ మార్చేసారు. ఈవెంట్ కోసం తాము హీరొయిన్లను సంప్రదిస్తే మేనేజర్ల మీదకు తోసేసే వారు కొందరైతే డబ్బులు ముట్టజెబితే కాని స్పందించని వారు మరికొందరు అంటూ కూల్ గానే ఫైర్ అయ్యాడు శివాజీ రాజా.

అమ్మ తల్లి అంటూ బ్రతిమిలాడుకుంటున్నా వినడం లేదని, ఇతర బాషల నుంచి వచ్చి కోట్లు కోట్లు తీసుకుని ఏదైనా చెక్ బౌన్సు లాంటి సమస్య వచ్చినప్పుడు మాత్రమే మా అసోసియేషన్ గుర్తుకు వస్తుందని, లక్ష ఫీజు కట్టి ఇరవై లక్షల ఫిర్యాదు వెంటనే చేతిలో పెడతారని ఇకపై ఇలాంటివి ఉపేక్షించమని సభా ముఖంగా వార్నింగ్ ఇచ్చేసాడు శివాజీ రాజా. తోకలు పెరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునే సమస్యే లేదని, కత్తిరించి పారేస్తామని కాస్తంగా ఘాటుగానే ఆయన కామెంట్ చేయటం సంచలనంగా మారింది. కో ఆపరేట్ చేస్తే ఫోటోలు కూడా పెట్టుకుంటామన్న శివాజీరాజా వారి పేర్లు మాత్రం చెప్పలేదు.

నిజానికి ఒక సీరియస్ ఇష్యూ ని సరైన టైంలోనే పబ్లిక్ చేసాడు శివాజీ రాజా. డబ్బులు ఇస్తే తప్ప కాలు కదపని కొందరు పరబాషా హీరొయిన్ వల్ల నిర్మాతలు కూడా ప్రమోషన్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు శివాజీరాజా చేసిన కామెంట్స్ ఎవరి గురించా అని తీవ్ర చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు అగ్ర హీరోల సరసన దివ్యంగా వెలిగి ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టిన ఇద్దరు ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి కాని ఆ తోక పెరిగిన తేలు కుట్టిన దొంగలు ఎవరో రాజా గారికే తెలుసు.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE