మహానటి 7 రోజుల వసూళ్ళ రిపోర్ట్

Updated By VankayaWed, 05/16/2018 - 17:09
Mahanati 7 Days Collections Report

తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు సినిమాల పరంగా ఫస్ట్ ఛాయస్ గా మహానటి తప్ప ఇంకేమి కనిపించడం లేదు. రంగస్థలం, భరత్ అనే నేను దూకుడు తగ్గింది కాబట్టి తర్వాత వచ్చిన సినిమాలన్నీ డివైడ్ టాక్ తో ఉండటంతో అందరు దీని వైపే మళ్లుతున్నారు. దాని ప్రభావం వసూళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. నా పేరు సూర్య రెండో వారం ఎంటర్ అయ్యే లోపే స్లో కాగా మెహబూబా రెండో రోజు నుంచే డెఫిషిట్ లోకి వచ్చేసింది. సో మహానటికి ఇక్కడే పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మొదటి వారం పూర్తి చేసుకున్న మహానటి ఫస్ట్ వీక్ వసూళ్లు ఏరియాల వారిగా ఇలా ఉన్నాయి

నైజాం – 4 కోట్ల 85 లక్షలు

ఉత్తరాంధ్ర – 1 కోటి 34 లక్షలు

సీడెడ్ – 93 లక్షలు

గుంటూర్ – 83 లక్షలు

కృష్ణా – 1 కోటి 3 లక్షలు

ఈస్ట్ – 76 లక్షలు

వెస్ట్ – 52 లక్షలు

నెల్లూరు – 26 లక్షలు

తెలుగు రాష్ట్రాలు (మొత్తం)- 10 కోట్ల 52 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 1 కోటి 60 లక్షలు

ఓవర్సీస్ – 7 కోట్ల 50 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా షేర్(మొత్తం)- 19 కోట్ల 62 లక్షలు

తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 12 కోట్లకే అమ్మిన నేపధ్యంలో రెండు వారాలు పూర్తి కాకముందే మహానటి పూర్తి లాభాల్లోకి అడుగు పెడుతుంది. మహా మహా స్టార్ హీరోల సినిమాలకు కూడా సాధ్యం కాని ఫీట్ ఇది. పెట్టిన బడ్జెట్ అమ్మిన రేట్ల ప్రకారం ఇది సాధ్యమయ్యింది. ఓవర్సీస్ లో ఈ రోజు కాని రేపు కాని అఫీషియల్ గా రెండు మిలియన్ డాలర్ల క్లబ్బులోకి అడుగు పెట్టనుంది మహానటి.ఈ రకంగా చూసుకుంటే మూడు వారాలు దాటే లోపే రెట్టింపు లాభాలు ఇచ్చే సినిమాగా ఇది అవతరిస్తుంది అని ట్రేడ్ టాక్. 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE