స్విమ్ సూట్ లో మానుషి- పిక్ స్టొరీ

Updated By VankayaWed, 02/14/2018 - 12:42
manushi chhillar in swimsuit

మిస్ వరల్డ్ గా భారతీయ అందాల పతాకాన్ని విశ్వవీధుల్లో ఎగరేసిన మానుషి చిల్లార్ సినిమాల వైపు అడుగులు వేయడానికి తెగ ఉరకలు వేస్తోంది. నిబంధనల ప్రకారం వెంటనే చేసే అవకాశం లేదు కనక వెయిట్ చేస్తున్న మానుషి తన మోడలింగ్ టాలెంట్ తో యూత్ ని తన అందమనే వర్షంలో ముంచేస్తోంది.

అందానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచినందుకే విశ్వ సుందరి కిరీటం గెలుచుకున్న ఈ బ్యూటీ తన స్టిల్స్ తో అందరి మతులు పోగొట్టే పనిలో ఉంది. పైన ఫోటోలో ఒంట్లోని ఒంపులు కనిపించేలా, థైస్ ని ఫుల్ గా ఎక్స్ పోజ్ చేస్తూ కవ్వించే స్టిల్ ఇచ్చిన మానుషిని చూస్తే ఏ మనిషైనా ఫిదా అవ్వాల్సిందే అనేలా ఉంది.

మంచి ఎండలో కింద నీలి రంగులో స్వచ్చమైన నీరు రమ్మని పిలుస్తుంటే, అందులో దిగాలా వద్దా అని ఆలోచిస్తూ కూర్చున్న మానుషి భంగిమకు మాటలు సరిపోవు. మెడికల్ స్టూడెంట్ అయిన మానుషి చిల్లార్ భవిష్యత్తులో డాక్టర్ గా కంటే యాక్టర్ గా ఉండడానికే ప్రాధాన్యం ఇస్తానని చెబుతోంది. కరణ్ జోహార్ నిర్మాణంలో తన మొదటి సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.

బాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువలా ముంచెత్తడానికి సిద్ధంగా ఉండగా తను మాత్రం ఆచి తూచి ఎంచుకుంటాను అని చెబుతోంది. తన డెబ్యు వచ్చే సంవత్సరం ఉండొచ్చు. ఐశ్వర్య రాయ్, సుష్మితా సేన్ తరహాలో తనకంటూ ప్రత్యేక ముద్ర బాలీవుడ్ లో వేయాలని ఆశపడుతోంది మానుషి చిల్లార్. నెరవేరాలనే కోరుకుందాం.  

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE