మెగాస్టార్ తో సావిత్రి, గణేషన్

Updated By VankayaThu, 05/17/2018 - 11:32
Megastar with Savitri,Ganeshan

మహానటి సినిమాలో అందరి సానుభూతి సావిత్రి గారివైపే ఉండటంతో పాటు ఆవిడను ఈ స్థితికి తెచ్చాడు అన్న కోపం జెమినీ గణేషన్ మీద లేడీ ఫాన్స్ కు ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో అతను వాళ్ళకు విలన్ గా కనిపిస్తూ ఉండగా అప్పట్లోనే రొమాన్స్ కింగ్ గా ముగ్గురు భార్యలకు భర్తగా ఏడుగురు పిల్లలకు తండ్రిగా ఉన్న అతన్ని మగాళ్ళు చూస్తున్నారు. ఏదైతేనేం మొత్తానికి అతని వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి చూడడానికి ఒక అవకాశం అయితే మహానటి సినిమా కల్పించింది.

సావిత్రి గారి మనకు మహానటే కాని జెమినీ గణేషన్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ. ఇక్కడ ఒక విశేషం ఉంది. జెమినీ గణేషన్ నటించింది ఒకే ఒక్క తెలుగు సినిమా. రుద్రవీణ సినిమాలో చాందసుడైన బ్రాహ్మణ పాత్రలో చిరంజీవికి తండ్రిగా కనిపిస్తారు. ఇద్దరు సై అంటే సై అంటూ పోటీ పడే సన్నివేశాలు చాలానే ఉంటాయి. క్లైమాక్స్ లో కొడుకు ముందు ఓడిపోయినా గర్వపడే తండ్రిగా ఆయన నటన పీక్స్.

సావిత్రి గారితో కూడా చిరంజీవి ఒక సినిమా చేసారు. ఆయన కెరీర్ లో విడుదలైన మొదటి సినిమా పునాదిరాళ్ళు లో సావిత్రి గారు ఒక కీలక పాత్ర పోషించారు. కాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అది చిన్న వేషం. అప్పటికే ఆవిడ బాగా చితికిపోయి ఉన్నారు. దాని తర్వాత నాలుగైదు సినిమాల కంటే ఎక్కువ చేయలేదు. ఆవిడ స్వర్గస్తులయ్యాక చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగాక రుద్రవీణ సినిమాలో జెమిని గణేషన్ తో కలిసి నటించే అవకాశం దక్కింది. ఇలా సావిత్రి గారితో జెమినీ గణేష్ లతో నటించిన రెండో తరం హీరో చిరంజీవి ఒక్కడే అని చెప్పొచ్చు.

మొదటి తరం ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లు చాలా సినిమాలు చేసారు కాని అ తర్వాత ఆ అరుదైన ఛాన్స్ దక్కింది మాత్రం చిరుకే. రుద్రవీణ సినిమాలో ఉన్నది మహానటిలో లవర్ బాయ్ గా కనిపించిన జెమినీ గణేషనే అని తెలుసుకుని ఆశ్చర్యపోవడం కామనే. అందుకే కాబోలు చిరు సావిత్రి గారితో నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు కాని అదే పనిగా రుద్రవీణ సినిమాలో తనతో పోటీగా సవాల్ విసిరిన జెమినీ గణేషన్ ప్రస్తవన మాత్రం తీసుకురాలేదు

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE