చింతమనేనికి తగిన శాస్తి జరిగిందా?

Updated By VankayaWed, 02/14/2018 - 19:05
MLA Chintamaneni Prabhakar sentenced to six months in jail

దూకుడు కాదు.. ఓవరాక్షన్, పచ్చి బూతులు మాట్లాడటం, అలా మాట్లాడితే తనేదో గొప్ప వాడిని అని ఫీల్ కావడం. ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి కూడా ఆయన వెనుకాడలేదు. తహశీల్దార్ వనజాక్షిపై చింతమనేని చేసిన దౌర్జన్యకాండ గురించి అందరికీ తెలిసిందే. ఆ వ్యవహారంలో చింతమనేనిని చంద్రబాబు నాయుడు కాపాడుకున్నాడు. పైపెచ్చూ వనజాక్షిదే తప్పుగా తేల్చారు. ఇలాంటి తీరుతో వివాదాల పాలైన చింతమనేని ప్రభాకర్ కు జైలు శిక్ష పడింది. మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ పై  దాడి చేసిన కేసులో చింతమనేని దోషిగా తేల్చింది కోర్టు.

వసంతకుమార్ పై భౌతిక దాడికి పాల్పడినందుకు గానూ చింతమనేనికి ఆరు నెలల పాటు జైలు శిక్ష పడింది. ఇది పాత కేసు. సరిగా కేసు నమోదు చేస్తే.. వనజాక్షిపై దాడి కేసులో కూడా ఈయనగారికి గట్టి శిక్షే పడుతుందేమో. అయితే.. వనజాక్షిపై దాడి కేసును నీరుగార్చేశారు.

పాత కేసులో మాత్రం చింతమనేని తప్పించుకోలేకపోయాడు. అది కూడా విప్ హోదాలో ఉన్నాడీయన. అసెంబ్లీలో కూడా నీఛమైన భాషను ఉపయోగించి వీడియోలకు చిక్కాడు చింతమనేని. అంత అసభ్యకరమైన ప్రవర్తన ఈయనకు సొంతం. ఈ నేపథ్యంలో ఈయనకు పడ్డ ఆరు నెలల శిక్ష తగిన శాస్తి అని అంటున్నారు నెటిజన్లు. అయితే ఈ శిక్షపై చింతమనేని పై కోర్టుకు వెళ్లవచ్చు. అక్కడ తేలడానికి ఇంకో ఐదారు సంవత్సరాలు పట్టినా పట్టవచ్చు. అయితే చింతమనేని మాత్రం తన తీరును మార్చుకోవాలని.. ప్రజాప్రతినిధి హోదాలో ఉండి.. కొంచెం సత్ప్రవర్తనతో నడుచుకుంటే మేలనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో అగుపిస్తూ ఉన్నాయి.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE