జేసీ రెడ్డీ... ఎవరికి చెబుతావ్ ఈ కాకమ్మ కబుర్లు!

Updated By VankayaWed, 02/14/2018 - 19:14
Modi Has Hatred and Jealousy on Chandrababu

చంద్రబాబు అంటే మోడీకి ఈర్షా ధ్వేషం.. అందుకే ఏపీకి న్యాయం చేయడం లేదు.. అన్నీ ఇస్తే చంద్రబాబు నాయుడు ఎక్కడ పైకి ఎదిగిపోతాడో అని మోడీకి భయం.. అందుకే ఏపీకి అన్యాయం చేస్తున్నారు.. ఇవీ తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కబుర్లు. ఇవి కాకమ్మ కబుర్లు, వాజమ్మ కబుర్లు అని వేరే చెప్పనక్కర్లేదు. ప్రజలను మోసం చేయడానికి, చంద్రబాబు నాయుడి చేతగాని తనాన్ని కప్పిపుచ్చడానికి, ఎన్డీయేలోంచి బయటకు రాలేని తమ తీరును సమర్థించుకోవడానికి దివాకర్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడని వేరే చెప్పనక్కర్లేదు. చెప్పుకోవడానికి ప్రజలంటే ఏమైనా భయం భక్తీ ఉంటే.. ఇలా మాట్లాడరు ఈ ఎంపీగారు.

ఒకవేళ జేసీ చెప్పిందే నిజం అనుకుందాం. చంద్రబాబు అంటే అంత ఈర్షా ధ్వేషాలు మోడీకి ఉన్నాయనే అనుకుందాం. అలాంటప్పుడు మోడీ అసహ్యించుకుని బయటకు రావొచ్చు కదా. మోడీ అంత వ్యక్తిత్వ హీనుడా? అంత వ్యక్తిత్వ హీనుడిని ప్రధాని పీఠంలో కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్లు మద్దతును ప్రకటిస్తూ ఉన్నారా? అలాంటి మోడీని ఇప్పటికీ తెలుగుదేశం వాళ్లు ఏమీ అనలేకపోతున్నారా? ఈ ప్రశ్నలకు కూడా తెలుగుదేశం వాళ్లే సమాధానాలు ఇవ్వాలి. చంద్రబాబు ఎదుగుదలను చూసి మోడీ ఓర్వలేడు అనుకున్నప్పుడు.. ఇంకా మోడీని పట్టుకుని తెలుగుదేశం ఎందుకు వేళాడుతున్నట్టు? ప్రతిపక్షాల వాళ్లు కూడా టీడీపీకి ఇప్పుడు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నారు. దమ్ముంటే.. తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు రావాలి అని.

అది ఒక్కటీ చేయలేకపోతున్న తెలుగుదేశం వాళ్లు.. తిరిగి భారతీయ జనతా పార్టీని కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారం తాము అనుభవించాలి, వ్యతిరేకత బీజేపీపై రావాలి అనే వ్యూహంతో సాగుతున్నారు టీడీపీ వాళ్లు.

అయినా.. చంద్రబాబు మోడీని మించి ఎదిగిపోవడం ఏమిటో అర్థం కావడం లేదు. దేశంలోని అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటిగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎం. ఏపీలో ఉన్న ఎంపీ సీట్లు పాతిక. వాటిల్లో సగం చోట్ల మాత్రం టీడీపీ గెలవగలిగింది. ఇలాంటి పార్టీకి అధినేతగా ఉండి.. చంద్రబాబు ఎక్కడికి ఎదిగిపోతాడు? విభజనకు గురి అయిన రెండేళ్లలోనే తెలంగాణలో టీడీపీ సున్నా స్థితికి తెచ్చారు. ఇదీ బాబుగారి పటిమ. ఇంకా చంద్రబాబును చూసి మోడీ అసూయపడతాడా?
 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE