"గాయత్రీ" మూవీ రివ్యూ

Updated By VankayaFri, 02/09/2018 - 14:03
Gayatri Movie Review

నిర్మాణ సంస్థ: ల‌క్ష్మి ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌
సంగీతం: ఎస్.ఎస్.తమన్
ఛాయాగ్రహణం: సర్వేశ్ మురారి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్
నిర్మాత: డా. మోహన్ బాబు యమ్.
దర్శకత్వం: మదన్ రామిగాని
తారాగ‌ణం: మ‌ంచు మోహ‌న్ బాబు, మంచు విష్ణు, శ్రియా శ‌ర‌న్‌, నిఖిలా విమ‌ల్‌, అన‌సూయ‌, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు

డైలాగ్ కింగ్ మోహన్‌బాబు ఒక పవర్ ఫుల్ రోల్ లో నటించి చాలా కాలం అయ్యింది. దాదాపు హీరో రోల్స్ కి దూరం అయిన ఆయన మళ్ళి చాలా కాలం తరువాత మెయిన్ లీడ్ గా "గాయత్రీ" అనే మూవీ లో నటించాడు. అసలు హీరోగా మార్కెట్ లేని టైం లో కేవలం ఒక మంచి సినిమా లో నటించాను అనే సంతృప్తి కోసం ఈ మూవీ లో నటించాడు మోహన్ బాబు. మరోసారి ఈ మూవీ లో మంచు విష్ణు హో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మోహన్ బాబు. మరి టిసర్ ఇంకా డైలాగ్స్ తో ఎన్నో అంచనాలు క్రియేట్ చేసిన ఈ "గాయత్రీ మూవీ ఎలా ఉందొ ఒకసారి రివ్యూ లో చూద్దాం.

కథ

దాసరి శివాజీ (మోహన్ బాబు) ఒక స్టేజి ఆర్టిస్ట్. ఒకవైపు ఈ పని చేస్తూనే మరో వైపు సొసైటీ కి మంచి చేసే మంచి మనసున్న వ్యక్తీ. ఎంతో అనాధాలకి శారద సదన్ ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేస్తూ ఉంటాడు. మరో వైపు డబ్బు కోసం తప్పు చేసిన నేరస్థుల స్థానం లో వెళ్లి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఈ క్రమం లోనే చిన్నప్పుడు ఎపుడో తప్పి పోయిన తన కూతురు అయిన గాయత్రీ (నిఖిల విమల్) కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ ఒక సంధర్బంలో కలుసుకుంటారు అనగా గాయత్రీ పటేల్ (మోహన్ బాబు) వచ్చి దాసరి శివాజీని కిడ్నాప్ చేస్తాడు. మరో పక్క ఫ్లాష్ బ్యాక్ లో తన భార్య శారద (శ్రీయ సరన్)‌కు శివాజీ (మంచు విష్ణు) ఎందుకు దూరమయ్యాడు, అసలు కూతురు ఎలా తప్పిపోయింది. చివరికి దాసరి శివాజీ తన కూతురిని ఎలా కలుసుకున్నాడు అనేది మిగిలిన కథ. 

నటీనటులు 

"గాయత్రీ" మూవీ ద్వారా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా రోజుల తరువాత తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఈ మూవీ లో ఆయన డ్యూయల్ రోల్ లో నటించారు. ఒక వైపు దాసరి శివాజీ అంటూ మంచి గా నటిస్తూనే, మరో వైపు గాయత్రీ పటేల్ గా క్రూరత్వాన్ని పలికించాడు. మోహన్ బాబు తన ఇమేజ్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథను ఎంచుకొని రెండు పాత్రలతో పలు రకాల షేడ్స్‌తో మోహన్‌బాబు సినిమాను మరోస్థాయికి చేర్చాడని చెప్పొచ్చు. ఇకపోతే యువ శివాజీ పాత్రగా మంచు విష్ణు అతిదిగా వచ్చాడు.

మంచు విష్ణు ఉన్నది కాసేపే అయిన గాని కథ ని ముందుకి నడిపే పాత్రలో నటించాడు. అలాగే విష్ణు భార్య గా నటించిన శ్రియ చాలా బాగా నటించింది.వీళ్ళిద్దరి పెయిర్ ఆన్ స్క్రీన్ చూడముచ్చటగా అనిపించింది. శ్రియ పాత్ర పరిధి చాలా తక్కువైనప్పటికీ కళ్లతో భావాలను అద్బుతంగా పలికించింది. ఇకపోతే  శ్రేష్ణ అనే జర్నలిస్టు పాత్రలో అనసూయ నటించింది. ఆ పాత్రలో అనసూయ పర్వాలేదనిపించింది. ఇకపోతే బ్రహ్మానందం, సత్యం రాజేష్, నాగినీడు,పోసాని కృష్ణ మురళి తమ తమ పాత్రల్లో పర్వాలేదు అనిపించారు. 

సాంకేతిక వర్గం

ఈ మూవీ కి మెయిన్ హై లైట్ డైలాగ్స్ అని చెప్పొచ్చు. డైమండ్ రత్నబాబు రాసిన ఈ మాటలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గాయత్రీ పటేల్ నోట నుంచి వచ్చిన పొలిటికల్ డైలాగ్స్ మూవీ కి చాలా హెల్ప్ అయ్యాయి. అలాగే మూవీ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా డైమండ్ రత్నబాబు తన మాటల తూటాలు పేల్చాడు. అలాగే మూవీ కి అంత గొప్ప సాంగ్స్ ఇవ్వలేని తమన్ మూవీ కి మాత్రం మంచి స్కోరింగ్ ని అందించాడు. ఈ మూవీ లో వచ్చే హనుమాన్ పాట అలాగే సెంటిమెంట్ పాట పర్వాలేదు అనిపించాయి.

కొన్ని ఫైట్ సీన్స్ స్కోరింగ్ విషయం లో కూడా తమన్ ఎక్కువ కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇకపోతే ఈ మూవీ ని డైరెక్ట్ చేసిన మదన్ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే ని స్లో పేస్ లో నడిపించిన గాని సెకండ్ హాఫ్ ని మాత్రం చాలా స్పీడ్ గా నడిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఇంకా ప్రీ క్లైమాక్స్ సీన్స్ ని మదన్ చాలా బాగా తెరకెక్కించాడు. మూవీ కథ పాతదే అయిన కూడా కథనం తో ఆకట్టుకున్నాడు మదన్.

తండ్రి ఇంకా కూతురి సెంటిమెంట్ ని బాగా వర్క్ చేసాడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని అవసరం లేని సీన్స ని తీసేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇక డైమండ్ రత్న బాబు నుంచి కూడా మంచి మంచి డైలాగ్స్ ని రాబట్టుకున్నాడు మదన్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఇంకా మాటల దగ్గర మదన్ సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. అలాగే మూవీ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మోహన్ బాబు మూవీ ని ఎక్కడా క్వాలిటీ పోకుండా ప్రొడ్యూస్ చేసాడు. టెక్నీషియన్స్ అందరికి ఫ్రీడం ఇచ్చి పని రాబట్టుకున్నాడు మోహన్ బాబు.

పాజిటివ్ పాయింట్స్

మోహన్ బాబు డ్యూయల్ రోల్

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్

విష్ణు, శ్రియ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నెగటివ్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ ప్లే

ఐటెం సాంగ్

రొటీన్ సీన్స

చివరి మాట

గాయత్రీ పటేల్ గా మోహన్ బాబు తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఒక మంచి కూతురి సెంటిమెంట్ ఉన్న కథకి కమర్షియల్ అంశాలు జత చేస్తే అదే "గాయత్రీ". మంచు అభిమానులకి ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. ఇకపోతే నార్మల్ ఆడియన్స్ తూటాల లాంటి మాటలు ఎంజాయ్ చేసి మంచి ఎమోషనల్ మూడ్ లోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం "గాయత్రీ" పై ఒక లుక్ వేయొచ్చు.

రేటింగ్: 2/5

In English :

Mohan Babu's Gayatri Movie Review!!

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE