థియేట‌ర్ లో కూతురిపై అత్యాచారయ‌త్నం, స‌హ‌కరించిన త‌ల్లి

Updated By VankayaMon, 05/14/2018 - 18:28
Mother arrested for allowing sexual abuse of her daughter in Kerala theatre

స‌ర‌స్వ‌తీ నిల‌య‌మైన కేరళ‌రాష్ట్రంలో వ‌రుస దారుణాలు చోటుచేసుకుంటున్నారు. అక్ష‌రాభ్య‌స‌తాశాతం ఎక్కువ‌గా ఉన్నగుంట‌కాడ న‌క్క‌లా కాపుకాస్తున్న తోడేళ్లు ఆడ‌వాళ్ల క‌నిపిస్తే చాలు మృగాళ్ల‌లా రెచ్చిపోతున్నారు. దీంతో కేర‌ళ‌లో ఆడ‌వాళ్ల బ‌ద్ర‌త‌పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. తాజాగా కేర‌ళ ఏడ‌ప్ప‌ల్ అనే ప్రాంతంలో ఓ థియేట‌ర్ ఉంది. ఆథియేట‌ర్ లో మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడి జ‌రిగింది. ఈ లైంగిక దాడిలో చిన్నారి త‌ల్లి భాగ‌స్వామ్యం ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. 

కేర‌ళ ముళ‌ప్పురానికి చెందిన వ్యాపార‌వేత్త మెయిదీన్ సినిమా చూసేందుకు త‌న‌తో పాటు 35ఏళ్ల మ‌హిళ‌ను, ఆమె కూతురును తీసుకెళ్లాడు. థియేట‌ర్ లో సినిమా ప్రారంభ‌మైన త‌రువాత మైన‌ర్ బాలిక‌పై హ‌త్య‌చారయ‌త్నానికి ప్ర‌య‌త్నించాడు. దీంతో బాధితురాలు పెద్ద‌గా ఏడుస్తు కేక‌లు వేయ‌డంతో ప్రేక్ష‌కులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. కేసు న‌మోదు చేసుకున్న‌పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ ద‌ర్యాప్తులో నిందితుడు మెయిదీన్ మైన‌ర్ బాలిక‌ను హ‌త్య‌చారం చేసేందుకు థియేట‌ర్ కు తెచ్చిన‌ట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు ఓ వైపు కూతురిపై లైంగిక దాడి జ‌రుగుతుంటే ఆమె త‌ల్లి స‌హ‌క‌రించిన‌ట్లు థియేట‌ర్ లో ఉన్న సీసీపుటేజీల్లో తేట‌తెల్ల‌మైంది. సీసీపుటేజీల ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారించారు. 

విచార‌ణ‌లో నిందితుడు మెయిదీన్ బాధితురాలి ఇంటికి త‌రుచు వెళుతుండేవాడ‌ని బాధితురాలు పోలీసులకు చెప్పింది. గతంలో కూడ తనపై అతను తప్పుడుగా వ్యవహరించాడు ఈ విషయాన్ని అమ్మతో చెబితే ఆమె దూషించిందని బాధితురాలు చెప్పారు. తమకు బట్టలు, భోజనం పెట్టించేవాడని బాధితురాలు చెప్పారు.

కాగా మెయిదీన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెన‌కాడారు. అయితే థియేట‌ర్ లో రికార్డ్ అయిన సీసీ పుటేజీలు ప‌లు ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కావ‌డంతో ప్ర‌భుత్వ యంత్రాంగం దిగివ‌చ్చి నిందితుడ్ని అరెస్ట్ చేసి విచార‌ణ ప్రారంభించింది. మైనర్ బాలిక తల్లిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలిని నిర్భయ సెంటర్ కు తరలించారు.
 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE