అనవసర యుద్ధానికి దిగుతున్నారు

Updated By VankayaTue, 02/13/2018 - 16:43
Naa Peru Surya and Bharat Ane Nenu to clash with Kaala on April 27

టాలీవుడ్ లో మరో సమరానికి రంగం సిద్ధం అవుతోంది. ఒకేసారి రెండు మూడు సినిమాలు రావడం మంచిది కాదు అని పదే పదే రుజువవుతున్నా మన నిర్మాతల ఆలోచనలో మాత్రం మార్పు రావడం లేదు. అనవసర పంతానికి పోటీకి పోతు వసూళ్లు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. కాలా రిలీజ్ డేట్ ఏప్రిల్ 27 ఫిక్స్ చేస్తూ పోస్టర్లు కూడా విడుదల చేయటంతో అదే డేట్ కోసం వెయిట్ చేస్తున్న నా పేరు సూర్య, భరత్ అనే నేను ఒకరోజు ముందు అంటే ఏప్రిల్ 26న రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

నా పేరు సూర్య ఓ రెండు వారాలు ముందు రావడమో లేక భరత్ అనే నేను మే నెలకు షిఫ్ట్ అయ్యే వార్తలు కూడా వచ్చాయి. కాని అవేవి జరిగే పని కాదని అర్థమైపోయింది. తాడో పేడో తేల్చుకోవడానికే మహేష్ అండ్ బన్నీ సిద్ధ పడుతున్నారు.

క్రేజ్ పరంగా మూడు సినిమాలు దేనికవే సాటి అనేలా ఉన్నాయి. రజనికాంత్ ఒక రోజు తర్వాత వస్తాడు కాబట్టి దాని గురించి తర్వాత చూసుకోవచ్చు. కాని అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలు ఒకేరోజు విడుదల అయితే ఫాన్స్ వరకు సమస్య లేదు అనిపించవచ్చు కాని తటస్థంగా సినిమాలు చూసే ప్రేక్షకులు ఏదో ఒకటి మాత్రమే చూస్తారు. రెండోది యావరేజ్ అని టాక్ వచ్చినా వదిలేస్తారు.

థియేటర్లో సినిమా చూడటం అనేది ఖరీదైన వ్యవహారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా అవాంఛనీయమైన పోటీకి పోయి వసూళ్ళలో తమకు తామే కోత పెట్టుకుంటున్నారు.26నే రెండు భారీ సినిమాలు రావడం చాలా రిస్క్ అవుతుంది. నిర్మాతలు ఒకరికొకరు మాట్లాడుకుని ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చే బదులు ఇలా సై అంటే సై అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంకా రెండు నెలల టైం ఉంది కనక మనసులు ఏమైనా మారి నిర్ణయం తీసుకుంటే మంచిది.  

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE