బాబూ..నిన్ను వదల అంటున్న మాజీ ఐఏఎస్!

Updated By VankayaWed, 02/14/2018 - 13:48
Naidu's Swiss Challenge Method for Amaravati challenged by former Chief Secretary

తెలుగుదేశం అధినేతపై ప్రభుత్వం మాజీ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పోరాటం ఆసక్తిదాయకంగా మారుతోంది. ఇప్పటికే చంద్రబాబు విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఐవైఆర్. బ్రహ్మిణ్ కార్పొరేషన్ విషయంలో ఐవైఆర్ స్పందిచడం ఆ తర్వాత లోకేష్ బాబు తీరుపై ఫేస్ బుక్ లో సెటైర్లు పెట్టడంతో పెద్ద దుమారమే రేగింది. ఆ సమయంలో రాజధాని భూ సమీకరణపై కూడా ఐవైఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అంతా పెద్ద కుంభకోణం అని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా ఐవైఆర్ పోరాటం కొనసాగుతూ ఉంది. బాబు విధానాలను విమర్శిస్తూ పత్రికల్లో ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారాయన.

ఈ క్రమంలో తాజాగా స్విస్ ఛాలెంజ్ విధానంపై ఐవైఆర్ కోర్టులో పిల్ దాఖలు చేయడం ఆసక్తిదాయకంగా మారింది. రాజధాని డెవలప్ మెంట్ కు అంటూ సీఆర్ డీఏ అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానాన్ని ఐవైఆర్ తప్పు పడుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే స్విస్ చాలెంజ్ విధానం తీవ్రంగా విమర్శల పాలైంది. కోర్టులు కూడా ఈ విధానాన్ని తప్పు పట్టాయి కూడా. ఈ నేపథ్యంలో ఐవైఆర్ వేసిన ఈ పిటిషన్ కు కోర్టు నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తిదాయకంగా మారింది. 

చంద్రబాబుపై ఈ ఆ మాజీ ఐఏఎస్ అధికారి పోరాటం సాగుతోంది. మరోవైపు రాయలసీమకు హై కోర్టు విషయంలో కూడా ఐవైఆర్ గట్టిగానే మాట్లాడుతూ ఉన్నారు. అసలు రాజధాని కూడా గ్రేటర్ రాయలసీమ పరిధిలోనే ఉండాలనేది ఐవైఆర్ భావన. ఈ విషయంలో ఆయన చంద్రబాబు ఎంపిక తీరును గట్టిగా తప్పు పడుతూ ఉన్నారు. దొనకొండ ప్రాంతంలో రాజధాని ఉండాలని శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేస్తే.. చంద్రబాబు మాత్రం రాజధానిని అమరావతి బాట పట్టించడంపై ఐవైఆర్ మండి పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన సీఆర్డీయే తీరుపై కోర్టు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE