అక్రమ సంబంధం ఎస్సైకి ఉదయభానుకు లింకు?

Updated By VankayaTue, 02/13/2018 - 18:00
ASP Sunitha reddy

ఇటీవల తెలంగాణలో సంచలనం రేపిన పోలీసుల అక్రమ సంబంధం వ్యవహారంలో ఆసక్తిదాయకమైన వార్తలు వస్తున్నాయి.  ఈ వ్యవహారంలో సునీతా రెడ్డి అనే ఎస్సై, మల్లికార్జున రెడ్డి అనే మరో సీఐలు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్యనా అక్రమసంబంధం ఉందని సునీతా రెడ్డి భర్త ఆరోపించాడు. వాళ్లిద్దరి సంబంధానికి సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టాడు. దీంతో పోలీసు శాఖ వాళ్లిద్దరినీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో.. ఈ కేసుపై విచారణ కూడా సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

సునీతారెడ్డిపై ఆమె భర్త బలమైన అభియోగాలే మోపుతున్నాడు. ఆమెకు ఇది వరకే పెళ్లి అయ్యిందని కూడా ఆయన చెబుతున్నాడు. తనకు ఆ విషయం చెప్పకుండా తనను ఆమె పెళ్లి చేసుకుందని అతడు చెబుతున్నాడు. సునీతారెడ్డికి తనకన్నా ముందు లెనిన్ అనే వ్యక్తితో వివాహం జరిగిందని అతడు ఆరోపిస్తున్నాడు. ఆ విషయాన్ని దాచి ఆమె తనను పెళ్లి చేసుకుందని అతడు అంటున్నాడు. 

ఇంతకీ ఈ లెనిన్ అనే వ్యక్తి ఎవరనే అంశం గురించి ఆరా తీస్తే అతడు.. ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభానుకు స్వయానా అన్న అనే మాట వినిపిస్తోంది. ఉదయభాను సోదరుడు అయిన లెనిన్ నే సునీతారెడ్డి మొదట వివాహం చేసుకుందని, అతడితో పెళ్లి విషయాన్ని దాచి ఆమె తనను వివాహం చేసుకుందని సునీత భర్త వాదిస్తున్నాడు. ఏదేమైనా దాదాపుగా మరిచిపోతున్న దశలో ఈ కేసులో కొత్త మాటలు, ప్రముఖుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. చివరకు ఈ కథ ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE