ఎన్టీఆర్ బయోపిక్ తాజా అప్ డేట్

Updated By VankayaThu, 05/17/2018 - 10:06
NTR biopic latest update

మహానటి ఇచ్చిన స్ఫూర్తి కాబోలు బాలయ్యకు మళ్ళి జవసత్వాలు వచ్చినట్టు ఉన్నాయి. నాన్న ఎన్టీఆర్ బయోపిక్ తీయాలా వద్దా అనే మీమాంసలో ఉన్న బాలకృష్ణకు ఇప్పుడు దర్శకుడిని సెట్ చేసుకోవడమే పెద్ద తలనెప్పిగా మారింది. ఇది అందరు ఆగిపోయింది అనే నిర్ణయానికి కూడా వచ్చేసారు. తేజ తప్పుకున్నాక పర్యవేక్షణ కోసం రాఘవేంద్ర రావుని కాని చంద్ర సిద్దార్థ్ ను కాని తీసుకుని తనే స్వయంగా డైరెక్ట్ చేయాలనుకుంటున్నట్టు కూడా గతంలోనే కథనాలు వచ్చాయి.

ఈ లోపు వివి వినాయక్ సినిమా స్క్రిప్ట్ సిద్ధం కావడం దాని షూటింగ్ ఈ నెలలోనే మొదలు పెట్టేందుకు అన్ని సెట్ చేసుకోవడం లాంటి కారణాల వల్ల ఇక బయోపిక్ ఉండదు అనే అనుకున్నారు అందరు. కాని విశ్వసనీయ సమాచారం మేరకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోందని తెలిసింది. ముందు చెప్పినట్టు దసరా కాకుండా వచ్చే సంక్రాంతి రిలీజ్ టార్గెట్ చేసుకుని షూటింగ్ ప్లాన్ చేస్తారట.

ప్రత్యేకంగా సెట్ అప్ చేయబడ్డ టీం ఒకటి ఆర్టిస్ట్ సెలక్షన్ ని కొనసాగిస్తోందని తెలిసింది. బసవతారకం గారి పాత్రకు నిత్య మీనన్ ఒకె చెప్పిందని న్యూస్. చంద్రబాబునాయుడు పాత్రలో రానాను ఒప్పించేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని టాక్. ఎన్టీఆర్ బయోపిక్ అంటే పెద్ద కాన్వాస్ కాబట్టి భారీ తారాగణం కావాల్సి ఉంటుంది. మహానటిలో చిన్న చిన్న పాత్రలకు కూడా మోహన్ బాబు లాంటి స్టార్స్ ని తీసుకోవడం ప్లస్ అయ్యింది. మరి దీనికి అంతకు రెండింతలు నటీనటులు అవసరమవుతారు.

అందుకే ఆలస్యం అవుతోందని నిర్మాతల్లో ఒకరి మాట. స్క్రిప్ట్ పూర్తి లాక్ అయిపోయిందని డైలాగ్ వర్షన్ తో సహా మొత్తం ఎప్పుడో ఫినిష్ చేసారని, దర్శకుడు దొరికితే వెంటనే సెట్స్ పైకి వెళ్తుందని చెబుతున్నారు. సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారిని అడిగారట కాని ఆయన సుముఖంగా లేరని తెలిసింది. ఆదిత్య 369 సీక్వెల్ ని తీయాలని ఉందని గతంలో ఈయన అన్నారు. అది దృష్టిలో పెట్టుకునే ఆయన్ను అడిగితే నో చెప్పారని తెలిసింది. మరి ఫైనల్ గా  ఈ బాల్ ఎవరి దగ్గర ఆగుతుందో చూడాలి.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE