ఇప్పుడు..పవన్‌కు పచ్చ మీడియా పవర్ అర్థమైందా?

Updated By VankayaThu, 05/17/2018 - 15:24
Pawan kalyan understand now yello media power?

పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు పచ్చ మీడియా పవరేంటో అర్థమయ్యే ఉండాలి. తెలుగుదేశం పార్టీకి పవన్ కల్యాణ్ మద్దతుగా నిలుస్తున్నంతసేపూ పచ్చ మీడియా పవన్ కల్యాణ్ కు విపరీతమైన ప్రాధాన్యతను ఇచ్చింది. పవన్ ఎక్కడకు వెళ్లినా ఒక రేంజ్ లో కవరేజీ ఇచ్చింది. పవన్ కల్యాణ్ కదిలాడంటే భూకంపం వచ్చేస్తోందన్నట్టుగా కలరింగ్ ఇచ్చాయి పచ్చ మీడియా చానళ్లు. ఆ సందర్భాల్లో పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలికేవాడు. వ్యవహారం ఏదైనా చంద్రబాబుకు మద్దతు పలికేవాడు. అయితే ఇప్పుడు పవన్ తీరు కొంచెం మారింది. తెలుగుదేశం పార్టీకి యాంటీగా మారాడు పీకే.

ఇటీవల జరిగినా ఆవిర్భావ దినోత్సవం దగ్గర నుంచి పవన్ తీరులో చాలా మార్పు వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శల వాడి పెంచాడు పీకే. అలాగే లోకేష్ పై కొన్ని ఆరోపణలు చేశాడు. ఇక కొన్ని పచ్చ చానళ్లు తనతో వ్యవహరిస్తున్న తీరుపై వరస ట్వీట్లు పెట్టాడు. ఇలా తెలుగుదేశం పార్టీకి వైరిగా తయారయ్యాడు పవన్ కల్యాణ్. ఇంకేముంది.. ఇప్పుడు పచ్చ చానళ్లు అసలు రూపాన్ని చూపుతున్నాయి.

జనసేన అధిపతి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నా, వైజాగ్ వెళ్లినా తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలు ఆయనను పట్టించుకోవడం లేదు. ఆయన పర్యటన గురించి సరైన కవరేజీ ఇవ్వడం లేదు. ఆఖరికి పవన్ ఎక్కడున్నాడో కూడా వీళ్లు చూపడం లేదు. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నంత సేపూ ఆయన గురించి విపరీత కవరేజీ ఇచ్చారు. ఆయన కదిలినా మెదిలినా కవరేజీ ఇచ్చారు. అయితే ఇప్పుడు పీకే యాంటీ తెలుగుదేశంలా కనిపిస్తుండే సరికి ఇవే మీడియా వర్గాలు ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదు. కవరేజీ ఇవ్వడం లేదు. బహుశా పచ్చమీడియా వర్గాల తీరేంటో పవన్ కు అర్థమై అవుతూ ఉంటుందిప్పుడు.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE