బాబు పాలనలో ఏపీ... మధ్యయుగంలోకి వెళ్తోందా?

Updated By VankayaWed, 05/16/2018 - 10:55
Chandrababu Naidu

ఏపీలో చంద్రబాబు పాలన వైఫల్యాలు కొనసాగుతూ ఉన్నాయి. అధికారుల అలసత్వం, ప్రజల ప్రారబ్ధంతో ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గోదావరి పుష్కరాల దగ్గర నుంచి కొనసాగుతున్న ఈ ఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా గోదావరి నది బోటు ప్రమాదం విషాదకరంగా మారింది. 50మందితో ప్రయాణిస్తున్న బోటు నదిలో మునిగిపోవడంతో 40 మంది గల్లంతయ్యారు. బోటు ఆచూకీని గుర్తించడమే కష్టం అయ్యింది. ఈ ప్రమాదంలో దాదాపు 38 మంది వరకూ చనిపోయి ఉండవచ్చని అంటున్నారు. మరణించిన వాళ్లంతా అమాయక గిరిజన జనం. 

బాబు పాలనలో ఇలాంటి ప్రమాదాలు కొత్త కాదు. ఆ మధ్య కృష్ణా నదిలో పర్యాటక శాఖ బోటు ఒకటి మనిగిపోయింది. ప్రభుత్వ బోటే పలువురి మరణానికి కారణం అయ్యింది. ఆ తర్వాత ఇటీవలే పర్యాటక శాఖకే చెందిన మరో బోటు అగ్నిప్రమాదానికి గురి అయ్యింది. ఆ ప్రమాదంలోనూ పలువురు మరణించారు. ఇలా వరస ప్రమాదాలు చోటు చేసుకున్నా.. మరో ప్రమాదాన్ని ఆపలేకపోయింది బాబు సర్కారు. ఈ సారి ఏకంగా 50 మంది ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఎక్కువమంది మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాపీగా సమీక్ష నిర్వహిస్తున్నాడు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అంటున్నాడు. అయితే ప్రమాదం జరగడానికి ముందు నివారణ చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఇలా పరిహారాలు ప్రకటించాల్సి వస్తోంది. 

ఏపీ ఇప్పుడు ఒక బుల్లి రాష్ట్రం. రాష్ట్రం చిన్నదైపోయి తనకు పని తక్కువైపోయిందని చంద్రబాబు కూడా అంటూ ఉంటాడు. అలాంటి చోట కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకొంటూ ఉన్నాయి. అనునిత్యం సమీక్షల పేరుతో గంటలకు గంటలు మీటింగులు పెట్టే చంద్రబాబు నాయుడు ప్రజలకు సురక్షిత జీవితాలను ఇవ్వడంలో మాత్రం పూర్తి విఫలం అవుతున్నాడు. ఒకవైపు సింగపూర్ , మలేసియా అంటూ కబుర్లు చెబుతూ.. రాష్ట్రాన్ని మధ్యయుగం దిశగా తీసుకెళ్తున్నాడు.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE