కర్ణాటకలో... రాష్ట్రపతి పాలన వస్తుందా?

Updated By VankayaThu, 05/17/2018 - 11:45
President's rule

ఒకవైపు సుప్రీం కోర్టులో నేమో యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ మేరకు ఆయన ప్రమాణస్వీకారం అయితే చేసేశాడు. అయితే ఈ వ్యవహారం ఇంతటితో ముగియలేదు. బలనిరూపణ జరగాల్సి ఉంది. ఈ విషయంలో గవర్నర్ ఉదారంగా వ్యవహరించాడు. పక్షం రోజుల సమయాన్ని ఇచ్చి అంతలోపు బలనిరూపణ చేసుకొమ్మని యడ్యూరప్పకు అభయం ఇచ్చాడు గవర్నర్. దీంతో పక్షం రోజుల వరకూ బీజేపీ వాళ్లే సేఫే.. అప్పుడు కథ ఎలాగో నడిపింవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఇంతలోనే కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్ వాళ్లు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ప్రమాణస్వీకారాన్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు తీసుకున్న సుప్రీం కోర్టు యడ్యూరప్పకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన పత్రాన్ని తమకు సమర్పించాలని ఆదేశించిందని తెలుస్తోంది. మినిమం మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల సైన్ తో లెటర్ ఇవ్వాలని కమలం పార్టీని ఆదేశించిందట సుప్రీం కోర్టు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆసక్తిదాయకంగా మారింది. మినిమం మెజారిటీ అయితే బీజేపీకి లేదు. అలాంటప్పుడు సంతకాలు ఎలా వస్తాయి? కాంగ్రెస్, జేడీఎస్ ల వాళ్లతో సంతకాలు చేయించి ఇచ్చారనుకుందాం. అప్పుడు వాటిని సుప్రీం కోర్టు ఆమోదిస్తుందా? అసెంబ్లీలో అయితే ఎంత రచ్చ జరిగినా ఎలాగోలా బల నిరూపణకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు సుప్రీం కో ర్టు జోక్యంతో వ్యవహరం రచ్చగా మారుతోంది.

అయితే ఈ అవకాశాన్ని బీజేపీ అయితే వదులుకోదు. ఏదో ఒకటి చేసి పట్టు నిలుపుకుంటుంది. అంతగా అవకాశం లేకపోతే కర్ణాటకలో రాష్ట్రపతి పాలనను విధించడానికి కూడా కేంద్రం వెనుకాడకపోవచ్చు.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE