సినిమా రాలేదు-డబ్బూ పోయింది

Updated By VankayaTue, 01/30/2018 - 17:30
Producer Lost Movie and Car Gift

ఆ ఇద్దరు పేరున్న ప్రొడ్యూసర్లు. ఇప్పటికే మంచి హిట్ సినిమాలు వాళ్ళ బ్యానర్ లో వచ్చాయి. వాళ్ళకు టాలీవుడ్ లో టాప్ మోస్ట్ క్రేజీ స్టార్ తో సినిమా తీయాలని కోరిక. ఒక్క సినిమా చేస్తే చాలు లాభాలతో పాటు పేరు కూడా వస్తుందని ఆశపడ్డారు. ఎలాగోలా ఆ స్టార్ హీరోకు మేనేజర్ గా వ్యవహరిస్తున్న ఒక మాజీ డైరెక్టర్ ను పట్టుకున్నారు. ఊరికే ఎవరు మాట వినరు కదా.

చేపకు గేలం వేసినట్టు అతనికి ఖరీదైన కానుకలు ఇచ్చారు. ఒకరు లగ్జరీ కారు కానుకగా ఇస్తే మరొకరు డైమండ్స్ పొదిగిన స్విస్ వాచ్ ఇచ్చారు. దీని విలువ లక్షల్లో ఉంటుంది. వీళ్ళ కానుకలకు పరమానందభరితుడైన ఆ డైరెక్టర్ ఎలాగైతేనేం హీరోతో వాళ్ళకు చేద్దాం అని మాట ఇప్పించడమే కాక అడ్వాన్సు రూపంలో డబ్బులు కూడా తీసుకునేలా చేసాడు.

ఆరు నెలలు తిరిగే సరికి సీన్ మొత్తం రివర్స్. ఇప్పుడు ఆ హీరో సినిమాలు చేయను అంటున్నాడు. అడ్వాన్సు ఎవరైతే ఇచ్చారు వాళ్ళను వెనక్కు తీసుకుపొమ్మని చెప్పి మేనేజర్ కు ఆర్డర్ పాస్ చేసాడు. దీంతో ఈయనకు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. కారణం భారీ మొత్తంలో ఇప్పించిన అడ్వాన్సు మీద ఆ నిర్మాతలు అప్పటికే వడ్డీ రూపంలో చాలా నష్టపోయారు. ఇప్పుడు వెనక్కు ఇచ్చినా వాళ్ళకు నష్టమే. ఈ సినిమా తీస్తున్నాం అని కారణం చెప్పే ఫైనాన్షియర్ల దగ్గర అప్పులు చేసారు.

ఇప్పుడు చేతిలో నుంచి వడ్డీ కట్టుకోవాలి. ఇక మేనేజర్ కు ఇచ్చిన కానుకలు వెనక్కు తీసుకుంటే పరువు పోతుంది. పైగా ఆ మేనేజర్ వాచీని, కారుని పరిశ్రమలో అందరికి తెలిసేలా ఇప్పటికే కట్టుకుని తిరిగాడు. సో తీసేసుకున్నా అందరు చూసి నవ్వుతారు. ఉన్నదీ పోయింది, ఉండాలి అనుకున్నది పోయింది అన్న సామెత తరహాలో ఇద్దరు లబోదిబో మనడం తప్ప ఇంకే మార్గం లేదు.  

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE