రకుల్ చెప్పిన స్పెషల్ సీక్రెట్స్

Updated By VankayaWed, 02/14/2018 - 14:47
Rakul speaks special secrets

టాలీవుడ్ లో నిన్నటి దాకా స్టార్ హీరోస్ కు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాగా స్లో అయిపోయింది. చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. లాస్ట్ ఇయర్ చేసిన జయ జానకి నాయక, స్పైడర్ ఫలితం తన మీద బాగా ప్రభావం చూపించింది. అందుకే ఇప్పుడు రాబోయే బాలీవుడ్ డెబ్యు మూవీ అయారి మీదే ఆశలన్నీ పెట్టుకుంది. అది కనక హిట్ అయితే ఓ నాలుగైదేళ్ళు అక్కడే సెటిల్ కావొచ్చు అనేది తన ప్లాన్.

దాని ప్రమోషన్ లో భాగంగా మీడియాతో బాగా యాక్టివ్ గా ఉన్న రకుల్ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. అందరు అనుకున్నట్టు తనకు మందు తాగే అలవాటు లేదని, ఇండస్ట్రీలో ఇది కామన్ అయినప్పటికీ తాను మాత్రం ఆ అలవాటుకు దూరంగా ఉన్నట్టు చెప్పింది. ఒక హీరోతో తాను ప్రేమలో ఉన్నట్టు కొందరు కథలు అల్లారని అవి కూడా అబద్దమని చెప్పిన రకుల్ ఇంతవరకు అసలు ప్రేమలోనే పడలేదట.

రకుల్ కెరీర్ బిగినింగ్ లో ఐరన్ లెగ్ అనిపించుకుంది కాని ఆ తర్వాత వరస హిట్లతో స్టార్ హీరొయిన్ గా బంపర్ ఆఫర్స్ కొట్టేసింది. ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండనివ్వకుండా ఫ్లాపులు క్యు కట్టి పలకరించడంతో హింది వైపు ఫోకస్ పెంచింది. మ్యాగజైన్ల కోసం ఎన్నడు లేని రీతిలో రెచ్చిపోయి మరీ స్టిల్స్ ఇస్తున్న రకుల్ ఎలాగైనా సరే బాలీవుడ్ లో జెండా పాతాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది.

అయారి కోసం ఎక్కడెక్కడో తిరిగి ప్రమోషన్ చేసుకున్న రకుల్ అందులో సిద్దార్థ్ మల్హోత్రా పక్కన జోడిగా నటిస్తోంది. ఈ నెల 16న అయారి విడుదల కానుంది. లైఫ్ బాగా బోర్ కొడుతోంది అన్న రకుల్ ఒక్క పవన్ కళ్యాణ్ తో తప్ప అందరితో నటించేసింది. పవన్ సినిమాలు మానేసాను చెబుతున్నాడు కాబట్టి ఆ రకంగా చూసుకుంటే రకుల్ కల నెరవేరే ఛాన్స్ లేదు.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE