ఆ పత్రిక మూసేస్తున్న రామోజీ రావు?

Updated By VankayaMon, 05/14/2018 - 15:28
Ramoji rao will close sitara Magazine publication

తెలుగు పత్రికా సామ్రాజ్యంలో రామోజీరావు నేపథ్యాన్ని వేరే వివరించనక్కర్లేదు. ఈనాడు అధిపతిగా రామోజీ అనేక సంచలనాలను రేపాడు. తన మీడియా బలం ద్వారా ముఖ్యమంత్రులనే దించడం, ఎక్కించడంతో కీలక పాత్ర పోషించాడు. ఎన్టీఆర్ ఎదుగుదలలోనూ ఆయనను దించేయడంలో కూడా రామోజీది ఆయన మీడియాది ముఖ్య పాత్ర. అలాగే చంద్రబాబుకు అనునిత్యం జాకీలు వేయడంలో కూడా రామోజీది ముఖ్య పాత్ర అని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు రామోజీకి చాలా వయసు మీద పడింది. ఆయన ఏ ఆదేశాలూ ఇచ్చే పరిస్థితుల్లో లేడని అంటారు. మీడియా వ్యవహారాలన్నీ ఆయన తనయుడు కిరణ్ చూసుకుంటాడు అనేది బయట ఉన్న ప్రచారం.

రామోజీ మీడియా వర్గాల్లో కొన్ని ఫెయిల్యూర్లు కూడా ఉన్నాయి. అనుకున్నంతగా రాణించలేకపోయిన పత్రికలు ఆయనకు ఉన్నాయి. వాటికి అనుకూలమైన ట్రెండే లేదిప్పుడు. అలాంటి వాటిల్లో ఒకటి సితార. 

ఇది సినీ వార పత్రిక. ఒక దశలో తెలుగులో సినీ వారపత్రికల ప్రభంజనం నడించింది. వీటిని జనాలు ఎగబడి కొనే వాళ్లు. అయితే ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ప్రత్యేకించి ఇంటర్నెట్ బాగా విస్తరించాకా సినీ పత్రికలకు ఏ మాత్రం డిమాండ్ లేకుండా పోయింది. దీంతో అన్ని పత్రికల సర్క్యులేషన్ కూడా బాగా తగ్గిపోయింది. అలాంటి వాటిల్లో ఒకటిగా నిలుస్తోంది సితార. దీనికి ఐదారు వేల సర్క్యులేషన్ కూడా లేదట. 

ఈ నేపథ్యంలో దీని ప్రింటింగ్ ఆగిపోనున్నట్టుగా తెలుస్తోంది. ఈనాడు వంటి పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా సితారను నడపడం వేస్టని ఆ గ్రూప్ ఫిక్సయ్యిందట. అందుకే ఈ పత్రికను మూసేయడానికే రామోజీ గ్రూప్ నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE