అమెరికాలో 50 రోజులా

Updated By VankayaWed, 05/16/2018 - 16:40
Rangasthalam

అసలు ఇప్పుడున్న పరిస్థితిలో ఒక తెలుగు సినిమా అర్ధ శతదినోత్సవం జరుపుకుంటేనే గొప్ప అనుకుంటున్నాం. అలాంటిది అమెరికాలో 50 రోజులు ఆడటం ఊహించగలమా. అమెరికాలో రంగస్థలం దీన్ని సుసాధ్యం చేసింది. రీగల్ మెక్ ఆర్థర్ అనే ధియేటర్ లో ఒకే స్క్రీన్ లో రంగస్థలం ఫిఫ్టీ డేస్ పూర్తి చేసుకుంది. ఇది టెక్సాస్ ప్రాంతంలో ఉంది. అంతే కాదు అదే థియేటర్లో ఒక తెలుగు సినిమా కోటి రూపాయల గ్రాస్ సాధించడం దీని ద్వారానే జరిగింది.

ఇది ఒక రకంగా రికార్డు అనే చెప్పాలి. చరణ్ సినిమాల్లో మగధీర తప్ప ఈ రేంజ్ లో ఏదీ ఆడలేదు. మళ్ళి ఇన్నాళ్ళకు చరణ్ స్టామినా ఏంటో తెలిసింది. తొమ్మిదేళ్ళ గ్యాప్ తర్వాత ఇప్పుడు మెగా ఫాన్స్ కి మరో ఆనందాన్ని జోడించింది. ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ ను అధికారికంగా దాటేసిన రంగస్థలం షేర్ విషయంలో 120 కోట్ల మార్క్ ని టచ్ చేయడానికి పరుగులు పెడుతోంది. అమెజాన్ లో ఒరిజినల్ వెర్షన్ పెట్టినా దాని ప్రభావం పెద్దగా లేదు.

మరో మూడు రోజుల్లో రంగస్థలం 50 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ 35 ఎంఎం సింగల్ స్క్రీన్ లో యాభై రోజులు దాటకుండానే 2కోట్లు గ్రాస్ దాటిన నేపధ్యంలో మే 18 సాయంత్రం 8 గంటలకు భారీ ఎత్తున సంబరాలు చేయడానికి మెగా ఫాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది గతంలో ఎన్నడు జరగనంత గ్రాండ్ గా ఉంటుందని టాక్. తెలుగు రాష్ట్రాల్లో కూడా వందకు పైగా సెంటర్స్ లో చిట్టి బాబు 50 రోజుల జెండా ఎగరవేయబోతున్నాడు.

ఈ మధ్య కాలంలో ఇలాంటి రికార్డు ఏ సినిమాకు దక్కలేదు. నాన్ బాహుబలి రికార్డులన్ని తన ఖాతాలో వేసుకున్న రంగస్థలంని బీట్ చేయటం ఇప్పట్లో జరిగే పనిలా కనిపించడం లేదు. అధికారికంగా వదిలిన అమెజాన్ ప్రైమ్ ప్రింట్ సైతం ఆన్ లైన్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకున్నట్టు సమాచారం. కాని ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది మాత్రం అమెజాన్ సంస్థ బయటపెట్టకపోవడంతో అవి తెలుసుకునే అవకాశం అయితే లేదు.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE