రవితేజ మారనే లేదా

Updated By VankayaThu, 05/17/2018 - 13:55
Raviteja not changed in story selection

మాస్ మహారాజాగా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న రవితేజ  కెరీర్ గత ఏడాది రాజా ది గ్రేట్ తో పుంజుకున్నట్టు కనిపించినా టచ్ చేసి చూడు పరాజయం నీ మార్కెట్ రేంజ్ ఎంతకు తగ్గిందో చూడు అంటూ ఎత్తి చూపింది. కాని రవితేజ ఆలోచనలో మాత్రం అంతగా మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. నిన్న విడుదలైన నేల టికెట్ ట్రైలర్ చూసాక అందరి నుంచి వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఇదే.

అరిగిపోయిన హీరో విలన్ ఫార్ములా తీసుకుని దానికి వయో వృద్ధుల సమస్యలు అనే ఎమోషనల్ టచ్ ఇచ్చి విలన్ తో యుద్ధం చేసే కాన్సెప్ట్ మీద దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చూపించిన లైన్ లో ఏ మాత్రం కొత్తదనం లేదు. పైగా ఇలాంటి విలనీ చేసి చేసి తనకే మొహం మొత్తేసిన జగపతి బాబుని మరోసారి అదే రొటీన్ పాత్రలో చూపించడం కూడా తేడా కొడుతోంది. ఇంకా విడుదల కాకుండానే తీర్పు చెప్పడం కరెక్ట్ కాదు కాని అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు చాలు అన్న రీతిలో ప్రేక్షకులు చాలా తెలివిగా విశ్లేషణ చేస్తున్నారు.

నిజానికి రాజా ది గ్రేట్ కూడా మూస మాసే. కాకపోతే హీరోకు కళ్ళుండవు అనే పాయింట్ వెరైటీగా కనెక్ట్ కావడంతో పాటు మాస్ పల్స్ బాగా తెలిసిన అనిల్ రావిపూడి టేకింగ్ దాన్ని గట్టెక్కించింది. అలా అని దాన్ని ఆల్ టైం రవితేజ బెస్ట్ లో కలపలేం. కాని సోగ్గాడే చిన్ని నాయన లాంటి టిపికల్ సబ్జెక్టుని నాగార్జున లాంటి మాస్ హీరో తో మెప్పించిన కళ్యాణ కృష్ణ ఇలా తను కూడా రొటీన్ లోకి వెళ్ళిపోవడం ఆశ్చర్యకరమే. నేల టికెట్ హిట్ కావడం రవితేజకు చాలా అవసరం.

హీరొయిన్ అంతగా ఆకట్టుకునేలా లేకపోవడంతో పాటు ఫిదా సినిమాకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చిన శక్తి కాంత్ దీనికి చాలా యావరేజ్ గా పాటలు కంపోజ్ చేయటం వల్ల మ్యూజిక్ అంతగా రీచ్ అవ్వట్లేదు. ఇన్ని మైనస్ ల మధ్య విడుదల కానున్న నేల టికెట్ సినిమాకు టికెట్లు భారీగా తెగాలి అంటే కథతో పాటు ట్రీట్మెంట్ లో చాలా వైవిధ్యం ఉండాలి. అదే పనిగా రెండేళ్ళు గ్యాప్ తీసుకుని ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్న రవితేజ కథా కథనాలపై ఇంకా ఫోకస్ పెంచాల్సిందే. లేకపోతే కుర్ర హీరోల పోటీ మధ్య నలిగిపోయే ప్రమాదం ఉంది. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE