సాహోని టెన్షన్ పెడుతున్న సల్మాన్

Updated By VankayaThu, 05/17/2018 - 18:49
Sahoo team tension about salman race 3 movie

అదేంటి రెబెల్ స్టార్ కి కండల వీరుడికి లింక్ ఏంటి అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నాం. జూన్ 15న రంజాన్ పండగా సందర్భంగా విడుదల కానున్న రేస్ 3 మూవీ ట్రైలర్ చూసారుగా. భీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో హాలీవుడ్ సినిమాలను తలదన్నే రేంజ్ లో ఉండటంతో ప్రశంసలతో పాటు నెగటివ్ కామెంట్స్ ని కూడా ఇది అందుకుంటోంది. సాహో కూడా పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ అన్న సంగతి తెలిసిందే.

రేస్ 3 ట్రైలర్ లో చూపించిన కొన్ని సీక్వెన్స్ లు అచ్చం సాహో కోసం దుబాయ్ లో ప్లాన్ చేసిన మాదిరిగా అనిపించడం యూనిట్ ని కొద్దిగా ఖంగారు పెడుతోందని తెలిసింది. సాహో షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు విడుదల చేసిన టీజర్ లో పైనుంచి స్కై డైవ్ చేస్తూ రెండు పాత్రలు మల్టీ స్టోర్ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకే షాట్ రేస్ 3లో కూడా ఉంది.

సో ఇలాంటివి ఇంకెన్ని రేస్ 3లో ఉన్నాయో తెలియాలంటే వచ్చే నెల మూడో వారం దాకా వెయిట్ చేయాల్సిందే. సాహో 50 రోజుల సుదీర్ఘమైన షెడ్యూల్ కోసం ఇప్పటికే దుబాయ్ లో ఉంది. నిపుణులైన ప్రఖ్యాత హాలీవుడ్ స్టంట్ మాస్టర్ల తో ఇందులో ఫైట్స్ ని కంపోజ్ చేయిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నీల్ నితీష్ విలన్ గా చేస్తున్నాడు. బాలీవుడ్ లో భారీ ఎత్తున విడుదల ప్లాన్ చేస్తున్నారు కనక రేస్ 3 తో ఎట్టి పరిస్థితుల్లో పోలిక రాకూడదు అనేదే సాహో టీం కోరిక.

ఇప్పటి దాకా ఒక రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ తెలుగు మూవీకి పెట్టనంత బడ్జెట్ దీని మీద పెడుతున్న కారణంగా ఏ మాత్రం రిస్క్ జరిగినా బిజినెస్ పరంగా చాలా ప్రమాదం. బాహుబలి ఇమేజ్ తో మార్కెట్ చేసినా నేషన్ వైడ్ సాహో వర్క్ అవుట్ కావాలి అంటే మాత్రం భారతీయ సినిమాల్లో మునుప్పెన్నడూ చూడని చిత్రాలు ఇందులో చూపాలి. మరి రేస్ 3 వచ్చాక ప్రేక్షకులకు కూడా దీని మీద ఒక అవగాహన వస్తుంది. అంత దాకా సస్పెన్స్ భరించక తప్పదు మరి

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE