సునంద పుష్కర్ కేసులో మెహ‌ర్ ఎక్క‌డా..?

Updated By VankayaMon, 05/14/2018 - 18:33
Shashi Tharoor Charged With Aiding Sunanda Pushkar's Suicide

కాంగ్రెస్ పార్టీ నేత‌ శశిథరూర్ భార్య సునంద్ పుష్కర్‌ మ‌ర‌ణంపై అనేక సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ పోలీసులు సునంద పుష్కర్ భ‌ర్త శశిథరూర్ పై పాటియాల మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధర్మేందర్ సింగ్ ఎదుట  ఛార్జీషీట్ దాఖ‌లు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో సునంద ఆత్మహత్య చేసుకునేలా ఆమెను ప్రేరేపించారని తెలిపారు.అయితే సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకొందని పోలీసులు నిర్ధారించారు. ఇది హత్య కాదని చార్జీషీటులో పోలీసులు అభిప్రాయపడ్డారు.

 2014, జ‌న‌వ‌రి నెల‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర‌మంత్రి శ‌శిథ‌రూర్ భార్య సునంద పుష్క‌ర్ (52)  ఢిల్లీలోని లీలా ఫైవ్‌స్టార్‌ హోటల్‌లోని 345 నంబర్‌ గదిలో అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందారు. 

సునంద పుష్క‌ర్ మ‌ర‌ణానికి ముందు ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో  పాకిస్థాన్‌కు చెందిన జర్నలిస్టు మెహర్‌ తరార్‌తో తన భర్త శశిథరూర్‌కు సంబంధాలున్నాయంటూ  వెల్లడించారు. మెహర్‌ తరార్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ కూడా అని సునంద ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆమె తన కాపురంలో నిప్పులు పోరాశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భర్త శశిథరూర్‌కు, మెహర్‌కు మధ్య కొన్నాళ్లుగా రహస్య సందేశాలు నడుస్తున్నాయని సునంద ఆరోపించారు. 2010 ఆగస్టులో సునంద పుష్కర్‌ను శశిథరూర్‌ వివాహం చేసుకున్నాడు. వారిద్దరి ఇది మూడో వివాహం.

కొన్నాళ్లుగా వీరిమధ్య సత్సబంధాలు లేన్నట్లుగా తెలిసింది. అయితే శశిథరూర్‌ వివాహేతర సంబంధాలున్నట్లు ఆరోపించడంపై పాకిస్థానీ జర్నలిస్టు మెహర్‌ తీవ్రంగా స్పందించారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆమె సునంద ఆరోపణలను తోసిపుచ్చారు. సునంద వ్యాఖ్యలు మీడియాలో కలకలం సృష్టించడంతో శశిథరూర్‌, సునంద సయుక్తంగా ప్రకటన జారీ చేశారు. తమ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని, తమ ట్విట్టర్‌ ఖాతాలను ఎవరో హ్యాక్‌ చేశారంటూ మీడియాకు  ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అయితే ప్రకటన జారీ చేసిన 24 గంటలు గడవక ముందే సునంద అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. 

దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు అనేక కోణాల్లో కేసును ఇప్ప‌టికూడా విచార‌ణ చేప‌డుతూ వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో నాలుగేళ్ళ తర్వాత  సునంద‌మృతి కేసుపై  ఢిల్లీ పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను మే 24 వ తేదికి కోర్టు వాయిదా వేసింది.
 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE