బీజేపీ ఎమ్మెల్యే వీరంగం

Updated By VankayaWed, 02/14/2018 - 15:58
 Pooran Prakash

అధికార పార్టీకి చెందిన నేత‌లు అధికారం ద‌ర్పంతో విర్ర వీగుతున్నారు. సాటి మ‌నిషి అనే తేడా లేకుండా దాడులు చేస్తున్నారు. తాజాగా బీజేపీ కి చెందిన ఓ ఎమ్మెల్యే త‌న కొడుకును ఉసిగొల్పి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేయించాడు. ఈ దాడి ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేయ‌డంతో ఆ ఎమ్మెల్యేల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ మ‌త్తులో సామ‌న్య ప్ర‌జ‌ల‌పై త‌మ కండ‌కావ‌డాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం ఏంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. 

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర‌ణ్ ప్ర‌కాశ్  మధురలో ఓ టోల్‌గేట్ ప్లాజా వద్ద వీరంగం సృష్టించాడు. పూరాణ్ ప్రకాశ్ త‌న కారును వీఐపీ ద్వారం గుండా డ‌బ్బులు క‌ట్ట‌కుండా వెళ్లే ప్ర‌య‌త్నించాడు. అయితే దీన్ని గ‌మ‌నించిన టోల్ ప్లాజ్ సిబ్బంది ఆయ‌న కారును ఆపి డ‌బ్బులు చెల్లించాల‌ని కోరాడు. అయితే సిబ్బంది త‌న‌ కారును ఆప‌డంతో ప‌క్క‌నే ఉన్న ఎమ్మెల్యే కుమారుడు మా కార్ల‌నే ఆపుతావా నీ అంతు తేలుస్తా అంటూ దాడికి దిగాడు. 

అంతేకాదు త‌న కొడుకు దాడి చేస్తున్నా ఎమ్మెల్యే పూర‌ణ్ ప్ర‌కాశ్ ప‌ట్టించుకోలేద‌ని టోల్ గేట్ సిబ్బంది వాపోయారు. గంట‌ల‌త‌ర‌బ‌డి ట్రాఫిక్ ను నిలిపివేసి త‌మపై అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషిస్తూ  కొన్ని గంటలపాటు కార్లన్నీ డబ్బులు కట్టకుండా వెళ్లేలా పంపించేశారని ఆరోపించారు.

అయితే త‌న కొడుకు దాడికి పాల్ప‌డుతున్న దృశ్యాలు వైర‌ల్ అవ్వ‌డంతో స్పందించిన ఎమ్మెల్యే త‌న‌కారుపై ఎమ్మెల్యే అని రాసి ఉన్నా పట్టించుకోలేదనీ.. అందుకే సిబ్బందిపై తన అనుచరులు దాడిచేశారంటూ స‌మ‌ర్ధించుకోవ‌డం కొస‌మెరుపు. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE