ఏపీ ప్ర‌భుత్వానికి కూడిక‌లు - తీసివేత‌లు వ‌చ్చా

Updated By VankayaWed, 02/14/2018 - 12:04
Somu veerraju fires on Ap Govt

ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ ప్ర‌భుత్వం ప‌లు  ప్ర‌శ్నానాస్త్రాలు సంధించారు. కేంద్రం ఏపీ అభివృద్దికి క‌ట్టుబ‌డి నిధులిస్తుంటే వాటికి ప్ర‌భుత్వం లెక్క చెప్ప‌డం లేద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్రం  ఏ ప‌థ‌కానికి ఎంత నిధిని చెల్లించిందో అణాపైసా తో స‌హా లెక్క చెప్పారు. నవ్యాంధ్ర  రెవెన్యూ లోటు రూ. 4,600కోట్లుంటే రుణమాఫీ, సంక్షేమ పథకాలు కలిపి రూ.16 వేల కోట్లుగా చూపిస్తోందని దుయ్య‌బ‌ట్టారు.  

రైతులు, డ్వాక్రా రుణమాఫీ, చంద్రన్న కానుకలంటూ లెక్కేసి  లోటు బడ్జెట్‌ అంటే వాటిని  కేంద్రం ఎందుకు భరిస్తుందని ప్రశ్నించారు. పోల‌వ‌రం నిర్మాణం, రైల్వేజోన్ , దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టుల నిర్మాణానికి ఎన్డీఏ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని సూచించారు. 

నాడు కేంద్ర‌ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్న వెంక‌య్య‌నాయుడు అమ‌రావ‌తి అభివృద్ధికోసం రూ. 1000కోట్లు ఇచ్చార‌ని  సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్‌భవన్‌ నిర్మాణానికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చింద‌ని గుర్తుచేశారు.ఈ సంద‌ర్భంగా కొంత‌మంది బీజేపీ ని తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని అస‌లు రాజధాని నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్లాన్‌ ఏదైనా ఉందా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

తెలంగాణాలో స‌చివాల‌యాన్ని రూ.200కోట్ల‌తో నిర్మించారన్న ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రం ఇచ్చిన నిధుల‌కు లెక్క చెప్పాలి క‌దా...? అదేం లేకుండా కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వ‌డంలేద‌ని స‌రికాదని మండిప‌డ్డారు. తాము ఇచ్చిన ప‌దేళ్ల కంటే ముందుగా అభివృద్ధి చేస్తున్నా నిందించ‌డం దారుణ‌మ‌ని అన్నారు.  

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE