ఏపీ బంద్ స్వచ్ఛందం, సంపూర్ణం, టీడీపీ ఆందోళన!

Updated By VankayaMon, 04/16/2018 - 11:41
Special status: State bandh today

ప్రత్యేకహోదా పోరాటంలో భాగంగా ఏపీ బంద్ కు స్వచ్ఛందంగా మద్దతునిచ్చారు ఏపీ ప్రజలు. సోమవారం బంద్ సందర్భంగా ఏపీ పూర్తిగా స్తంభించింది. విద్యాలయాలకు ముందుగానే సెలవు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ప్రత్యేకహోదా సాధన సమితి, జనసేన తదితర పక్షాలు ఈ బంద్ కు మద్దతు పలికాయి. ఈ పార్టీల వాళ్లు ఉదయమే ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని బస్సులను ఆపేశారు. దీంతో ఆర్టీసీ బస్సులేవీ రోడ్డు ఎక్కలేదు. రోడ్ రోకోలతో కూడా ఈ పక్షాలు రోడ్డెక్కడంతో జనజీవనం స్తంభించింది. ఇక రాష్ట్రం కోసం నిర్వహిస్తున్న ఈ బంద్ కు ప్రజానీకం నుంచి కూడా పూర్తి మద్దతు లభించింది.

ప్రతి నియోజకవర్గం కేంద్రంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు, నేతలు బంద్ ను విజయవంతం చేసే బాధ్యతను తీసుకున్నారు. రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించారు. ఎక్కడా హింసాత్మక సంఘటనలు లేకుండానే ఈ బంద్ జరుగుతోంది. పలు చోట్ల మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు దురుసుగా వ్యవహరించిన దాఖలాలు కనిపించాయి.

ఇక కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ బంద్ లో యాక్టివ్ గా పాల్గొన్నాయి. జనసేన కూడా అక్కడక్కడ బంద్ లో కనిపించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ స్టేట్ బంద్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు బంద్ సందర్భంగా పాదయాత్రకు విరామం ఇచ్చారు. విజయవాడ సమీపంలో జగన్ పాదయాత్ర సాగింది నిన్న. బంద్ సందర్భంగా జగన్ ఈ రోజు విరామం ఇచ్చారు. ఈ బంద్ కు తెలుగుదేశం పార్టీ మద్దతు పలకలేదు. బంద్ అవసరం లేదని తెలుగుదేశం నేతలు తేల్చారు. అధికార పార్టీ సహకారం లేకపోయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బంద్ పరిపూర్ణం అయ్యింది. ఈ బంద్ కు ప్రజల స్వచ్ఛంద మద్దతుతో తెలుగుదేశం నేతల్లో కూడా ఆందోళన రేగుతోంది. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE