పవన్ గురించి ఇంత పచ్చి బూతా

Updated By VankayaTue, 04/17/2018 - 09:31
Sri Reddy

శ్రీరెడ్డి వ్యవహారం ఈ రోజు పూర్తిగా దారి తప్పేసింది. మీడియా మైకులు తనను పదే పదే వెంటాడటం ఉత్సాహాన్నీ ఇచ్చింది కాబోలు ఏకంగా ఇక్కడ రాయలేని భాషలో అందరూ చూస్తుండగానే తిట్టి పోసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకెవరు పవన్ ని అన్నా అని పిలవలేరని, ఇంతకు ముందు అలా అన్నందుకు తాను కూడా సిగ్గు పడుతున్నానని చెప్పిన శ్రీశక్తి(కొత్త పేరుతో వ్యవహరించమని నిన్ననే చెప్పుకుంది)ఇంకో షాక్ ఇచ్చింది. అందరూ చూస్తుండగానే కెమెరా లైవ్ ఉందనే ఉద్దేశంతో చెప్పు తీసుకుని తన చెంప తానే వాయించుకోవడం చూసి మీడియా ప్రతినిధులు కూడా షాక్ తిన్నంత పనైంది. 

పవన్ ని ఆమె అన్న బూతు సభ్యత కొద్దీ ఇక్కడ ప్రచురించడం లేదు కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. గతంలో కత్తి మహేష్ తో వివాదంలో ఇష్యూ చేసిన పవన్ ఫాన్స్ ఇప్పుడు శ్రీశక్తి విషయంలో కూడా కత్తులు నూరుతున్నారు. వాళ్ళ ప్రవర్తన సంగతి పక్కన పెడితే శ్రీశక్తి చేసింది మాత్రం ఏ మాత్రం సమర్ధనీయం కాదు.

పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే బెటర్ అని ఒక సలహా ఇచ్చినందుకు ఇంత దారుణంగా తిట్టడం పట్ల ఆమె సపోర్టర్స్ కూడా కాస్త షాక్ తిన్నారు. మొత్తానికి అంతకంతకు వేడిని పెంచుతున్న శ్రీశక్తి వ్యవహారం ఈ రోజు ముదిరి పాకాన పడింది. వీడియో చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE