
శ్రీరెడ్డి ఉదంతం నిన్న పవన్ కళ్యాణ్ మీద చేసిన అసభ్యకర కామెంట్స్ తో పతాక స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. దీని మీద సర్వత్రా విమర్శలు వస్తుండటంతో డిఫెన్స్ లో పడిన శ్రీరెడ్డి ఇప్పుడు తనను తాను సమర్ధించుకునే అర్థం లేని ప్రయత్నం చేస్తోంది. పవన్ తల్లిని అంటే అంత కోపం పొడుచుకుని వస్తోందే మరి నేను కూడా ఆడదాన్నే కదా నేను కనిపించడం లేదా అని అమాయకంగా అడగటం చూసి తన మానసిక పరిస్థితికి జాలి పడటం తప్ప ఏమి చేయలేని పరిస్థితి.
నిజానికి పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి విషయంలో చేసింది ఏమి లేదు. జస్ట్ సమస్య ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇవ్వమని చెప్పాడు. మరీ తప్పదు అనుకున్నప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలే తప్ప ఇలా స్టూడియోలకు వెళ్ళకూడదు అని. ఆ మాత్రం దానికే శ్రీరెడ్డి ఇచ్చిన బదులు ఇప్పుడు రాజీ పడిన మా సంఘానికి కూడా పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది.
తనను ఎవరైతే వేధించారో ఎవరైతే వాడుకున్నారో వాళ్ళను వదిలేసి ఇలా పవన్ మీద పడటం ఏంటి అనే ప్రశ్నకు మాత్రం తన వద్ద బదులు లేదు. గత నాలుగైదు రోజులుగా ప్రెస్ మీట్లంటూ టీవీ డిబేట్లంటూ యమ బిజీగా తిరిగేస్తున్న శ్రీరెడ్డి తనను స్టూడియోలో రేప్ చేసి వాడుకున్నాడు అని చెప్పిన నిర్మాత కొడుకు గురించి కాని అతని తండ్రి గురించి కాని ఎక్కడా ప్రస్తావించడం లేదు. నిజానికి తను డిమాండ్ చేయాల్సింది అదే.
ఫోటోలు చూపించాను కదా ఆ నిర్మాత వచ్చి తన అబ్బాయి చేసిన నిర్వాకం గురించి వివరణ ఇవ్వాలి అని అడగాల్సింది పోయి కేవలం పవన్ మాత్రమే బయటికి రావడం లేదు, పవన్ ని ఎవరు అన్నా అనకండి అని పిలుపు ఇవ్వడం చూస్తే తేడా వ్యవహారంలాగే ఉంది. ఆ నిర్మాతకున్న పలుకుబడికి భయపడే శ్రీరెడ్డి ఆయన పేరుని ఎక్కడా వాడటం లేదని, కొన్ని శక్తుల ప్రోత్సాహం ఉన్నందువల్లే ఇలా రెచ్చిపోతోందని వస్తున్న కథనాల్లో నిజాలు ఉన్నట్టే