ఐదేళ్ళకే హీరొయిన్ కు సెక్స్ వేధింపులు

Updated By VankayaTue, 04/17/2018 - 15:58
Sri Vishnu's heroine recounts sexual harassment horror

అసిఫా ఉదంతం తర్వాత మహిళా రక్షణ గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఆడపిల్ల కనీసం ఇంటికి క్షేమంగా చేరుతుందా లేదా అనే అభద్రతా భావం రోజు రోజుకి తల్లి తండ్రుల్లో పెరిగిపోతోంది. ఐదేళ్ళ ప్రాయం మొదలుకుని అరవై ఏళ్ళ పండు ముసలి వరకు ఎవరినీ వదలని కామ పైత్యం శృతి మించిపోతోంది. చట్ట పరంగా వెంటనే చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడం విచారణ పేరుతో సంవత్సరాల తరబడి కోర్టుల్లో సాగదీస్తున్న వైనం సమస్యను ఇంకా జటిలం చేస్తూనే ఉన్నాయి.

తాజాగా మెంటల్ మదిలో హీరొయిన్ నివేతా పేతురాజ్ లైంగిక వేధింపుల గురించి వీడియో రూపంలో స్పందించింది. అందరు అనుకుంటున్నట్టు కాకుండా అమ్మాయిలకు పసి ప్రాయం నుంచే ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయని కాని అక్కడ ఆగంతకులు ఉండరని, మన బంధువులు, స్నేహితులు, తెలిసినవాళ్లు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇలా పక్కనే ఉంటూ కామ దృష్టితో అమ్మాయిలనే టార్గెట్ చేసే మేక వన్నె నక్కలు ఉంటాయని చెప్పింది.

ఐదేళ్ళ ప్రాయంలో తాను ఫేస్ చెసిన ఒక చేదు సంఘటన కనీసం అమ్మానాన్నకు చెప్పాలని కూడా తెలియని వయసని, ఇప్పుడు అసిఫా గురించి తెలిసాక కన్నీళ్ళు ఆగటం లేదని ఆవేదన వ్యక్త పరిచింది. ఇవి అరికట్టాలంటే అందరు ఒక తాటి పైకి రావాలని పిలుపు ఇచ్చింది. ఏదైనా కాలనీ కాని అపార్ట్ మెంట్ కాని అందులో ఉండే కొందరు ఒక టీం గా తయారయ్యి ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ వచ్చే వ్యక్తులను పరిశీలించడం అమ్మాయిల రాకపోకలను గమనించడం లాంటివి నిశీతంగా చూస్తూ ఏదైనా తప్పు అనిపించినప్పుడు వెంటనే స్పందించేలా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చింది.

అదే పనిగా కాకపోయినా వంతుల వారిగా అక్కడ ఉన్న వారందరూ ఈ బాధ్యతను షేర్ చేసుకుంటే చాలా మటుకు అరికట్టే అవకాశం ఉంటుందని చెబుతోంది. ఈ మధ్య నాని నిర్మించిన అ!! మూవీ ఇదే కాన్సెప్ట్ మీదే ఉంటుంది. ఒక అమ్మాయి తన జీవితంలో వివిధ దశల్లో ఎదురుకున్న లైంగిక వేధింపులకు తట్టుకోలేక చివరికి ప్రాణాలు వదిలే దాకా వస్తుంది. కాని సినిమాలో కంటే బయట పరిస్థితి ఇంకా దారుణంగా ఉండటం నిజంగా విచారకరం.

In English :

Sri Vishnu's heroine recounts sexual harassment horror

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE