వయసు సరే మరి సంస్కారం ?

Updated By VankayaFri, 06/08/2018 - 17:38
Star Comedian

అతనో స్టార్ కమెడియన్. ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలు సైతం అతని డేట్స్ కోసం వేచి చూసిన రేంజ్ ఉండేది. కాలక్రమేణా వయసు మీద పడటంతో పాటు అతను చేస్తున్న పాత్రలన్నీ రొటీన్ గా మారడంతో దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం మానేశారు. ఇటీవలే వచ్చిన ఒక పెద్ద మాస్ సినిమాలో చాలా దారుణమైన పాత్ర ఇచ్చినా ఆలోచించకుండా చేసేయటం విమర్శలకు కూడా అవకాశం ఇచ్చింది.

రోజుకు లక్ష ముక్కు పిండి వసూలు చేస్తాడనే చాలా మంది మధ్య స్థాయి నిర్మాతలు కాల్ చేయటం కూడా మానేశారు . ఇతనికి ఉన్న మా చెడ్డ అలవాటు అవతలి వాళ్ళను ఎగతాళి చేయటం. ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్న ఒక అప్ కమింగ్ ఏజ్ కమెడియన్ పక్కన ఉన్నప్పుడు ఏదో పని మీద ఒక నిర్మాత సదరు సీనియర్ హాస్య నటుడికి ఫోన్ చేసాడు.మనోడే కదా అని స్పీకర్ ఆన్ లో పెట్టేసాడు. ఆ విషయం అవతల మాట్లాడుతున్న సదరు హాస్య చక్రవర్తికి తెలియదు. 

యోగక్షేమాలు అయ్యాక తన పక్కన మరో హాస్య నటుడు ఉన్నట్టు ఇతను చెప్పాడు. అంతే. ఒక్కసారిగా తనలో నెగటివ్ యాంగిల్ చూపించాడు ఆ స్టార్ కమెడియన్. అసలు వీళ్ళందరికీ టైమింగ్ లేదని కేవలం తానుగా అవకాశాలు తగ్గించుకుని రెస్ట్ తీసుకోవడం వల్లే అందరు సెటిల్ అవుతున్నారని పేలాడు. అక్కడితో ఆగితే పర్వాలేదు. అక్కడే ఉన్న నటుడి గురించి వెకిలిగా మాట్లాడ్డం మొదలుపెట్టడంతో అక్కడే ఉన్న మిగిలిన వాళ్ళు కూడా షాక్ తిన్నారట.

ఇన్నాళ్లు తాము గౌరవంగా  చూసిన నటుడిలో ఇంత విషం ఉందా అని తెలుసుకుని అతన్ని అసహ్యించుకోవడం మొదలు పెట్టారు . అయినా వయసు అయిపోయి చేయడానికి ఏమి లేనప్పుడు కూడా నేనే సర్వం అంతా నాదే అనేలా వ్యవహారిస్తున్న ఆ స్టార్ కమెడియన్ సంస్కారం గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది అంటున్నారు ఇదంతా దగ్గరి నుంచి గమనించినవాళ్ళు. 
 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE