కక్కుర్తి పడే హీరోలు కూడా ఉన్నారు

Updated By VankayaMon, 04/30/2018 - 11:50
Star Hero Charging Rent For Own Caravan

పైసామే పరమాత్మ అనే సామెత ఏదో నోటి మాటగా పుట్టుకు వచ్చింది కాదు. కొందరికి పైసా మిగులుతుంది అంటే అవతలి వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు అనుకునే రకం కూడా ఉంటారు. ఆహ నా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు లాంటివాళ్ళు ఇదే బ్యాచ్ లోకి వస్తారు. ఇక విషయానికి వస్తే అతనో స్టార్ హీరో. వందల్లో సినిమాలు చేయలేదు కాని చేసినవి తక్కువే అయినా మార్కెట్ మాత్రం పెద్దదే.

అతనికి ఒక కార్వాన్ ఉంది. తన టేస్ట్ కు అనుగుణంగా ప్రత్యేకంగా దాన్ని తయారు చేయించుకున్నాడు. సాధారణంగా కార్వాన్ షూటింగ్ స్పాట్ కు తీసుకొస్తే అది హీరోదే అయినా కేవలం సెక్యూరిటీ వరకే నిర్మాత బాధ్యత తీసుకుంటాడు. లోపలి మెయిన్ టెనెన్స్ మొత్తం హీరోనే చూసుకోవాలి. చాలా అరుదుగా అద్దె కారవాన్ల మీద హీరోలు ఆధారపడటం కనిపిస్తుంది.

కాని ఈ హీరో మాత్రం తన స్వంత డబ్బులతో కొన్న కారవాన్ కు సైతం అద్దె డబ్బులు తను నటించే సినిమాల నిర్మాతల ద్వారానే ముక్కు పిండి వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఇంతా చేసి అతనేమి ఇమేజ్ తోనే కోట్ల రూపాయల ఓపెనింగ్స్ తెచ్చే హీరో కాదు. బాగుంది అంటే టాక్ వస్తే తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమాలకు రెట్టింపు లాభం తెచ్చేవాడు. టాక్ తేడా వస్తే ఇతని సినిమాకు మధ్యాన్నం షోకే జనం ఉండరు. అలాంటిది ఇంత బిల్డప్ ఎందుకబ్బా అనే అనుమానం అందరికి వస్తున్నా వేరే మార్గం లేక అన్ని భరిస్తున్నట్టు టాక్. ఇతని గత మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా డిమాండ్ లో పెద్ద మార్పు లేదు.

ఇలా అద్దె రూపంలోనే దాదాపు కారవాన్ బస్సు కోసం పెట్టిన ఖర్చు మొత్తం రాబట్టినట్టు టాక్. ఇలాంటి దుబారాల గురించి ఏ నిర్మాత చర్చించడని ఇలాంటివి కాస్టింగ్ కౌచ్ తో సమానంగా నిర్మాతలకు గుదిబండగా మారాయని బాహాటంగానే విమర్శిస్తున్నారు కొందరు నిర్మాతలు. అయినా పట్టించుకునేదెవరు. అన్నట్టు ఇంతా చేసి రోజు వారి అద్దె ఎంతో తెలుసా. జస్ట్ ఆరు వేలు. అంత చిన్న మొత్తాన్ని కూడా నిర్మాత దగ్గర ముక్కు పిండి వసూలు చేసే వాళ్ళను ఏమనాలో.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE