సైరా – అది మాత్రం తేల్చరా

Updated By VankayaMon, 04/16/2018 - 15:59
Sye Raa Narasimha Reddy

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా షూటింగ్ మరీ వేగంగా కాదు కాని ఓ మోస్తరుగా జరుగుతోంది. కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అమితాబ్ తో పాటు నయనతార పాల్గొన్న సీన్స్ కు సంబంధించిన ఫోటోలు కూడా ఈ మధ్య లీక్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మరో హీరొయిన్ గా తమన్నా కూడా జాయిన్ కాబోతోంది. తనే కన్ఫర్మ్ చేస్తూ చెప్పేసింది కూడా.

ముందు ప్రగ్యా జైస్వాల్ అనుకున్నారు గత కొంత కాలంగా పాప ట్రాక్ రికార్డు చాలా బ్యాడ్ గా ఉంది. అందుకే డ్రాప్ అయ్యారేమో అనే టాక్ కూడా ఉంది. తమన్నా పాత్ర ఏంటి అనే వివరం మాత్రం బయటికి రాలేదు. నరసింహరెడ్డికి జోడిగా తమన్నా కూడా కనిపిస్తుందా అంటే ఇప్పటికైతే స్పష్టత లేదు.

కాని సంగీత దర్శకుడి విషయం మాత్రం ఎటూ తేల్చక నానుబెడుతునే ఉన్నారు సైరా టీం. ఎఆర్ రెహమాన్ చేయును అని తప్పుకున్నాడు. బిజీ గా ఉండటం వల్ల కాదని తర్వాత తేలిపోయింది. సైరా డ్రాప్ అయ్యాను అని చెప్పిన తర్వాత రెహమాన్ మూడు కొత్త తమిళ సినిమాలకు సైన్ చేసాడు. కొద్ది రోజులు మణిశర్మ పేరు వినిపించింది. లేదు లేదు మోషన్ పోస్టర్ కి వాయించిన తమన్ నే పెట్టుకుందాం అనుకున్నారని కొద్ది రోజులు అన్నారు.

ఇవన్ని కాదు మాస్ట్రో ఇళయరాజా ఉన్నారు కదా అనుకున్నారు. కాని ఆయనలో మునుపటి మేజిక్ ఇప్పుడు పని చేయటం లేదు. చివరికి బాలీవుడ్ ఫేం అమిత్ త్రివేది అనుకుంటున్నారు. కాని పర బాషా సంగీత దర్శకులు ఏమంత చెప్పుకోదగ్గ అవుట్ పుట్ ఇవ్వడం లేదని అజ్ఞాతవాసి, కృష్ణార్జున యుద్ధం, టచ్ చేసి చూడు సినిమాలు ప్రూవ్ చేసాయి. నా పేరు సూర్య ఆడియోకు కూడా గొప్ప టాక్ ఏమి లేదు. మరి సైరాకు మ్యూజిక్ డైరెక్టర్ ని ఎప్పుడు తెలుస్తారో చూడాలి.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE