ఫేక్ ఫొటోతో దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ..!

Updated By VankayaMon, 04/16/2018 - 16:38
TDP candidate found with Fake photo

తెలుగుదేశం పార్టీ ఇది వరకూ అనేక సార్లు ఫేక్ ఫొటోలతో దొరికిపోయింది. గ్రాఫిక్ మాయాజాలాలు తెలుగుదేశం పార్టీ విజయ రహస్యాలు. గత ఎన్నికల ముందుంతా గ్రాఫిక్ ఫొటోస్ చూపించి బండి లాగించారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రం మారిపోతుంది అంటూ సింగపూర్ ఫొటోలను చూపించారు. సింగపూర్ గురించి ఎన్నో గొప్పలను రాశారు. సింగపూర్లోని అద్భుతమైన లొకేషన్ల ఫొటోలను ప్రచారంలోకి తీసుకొచ్చారు. తీరా అధికారం చేతికి అందాకా మాత్రం రాష్ట్రం ఏ మేరకు మారిందో అందరికీ తెలిసిన సంగతే. ఇక చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్మితమైన తాత్కాలిక సచివాలయం కూడా చిన్న వర్షానికే కారి.. బాబుగారి డొల్లతనాన్ని చాటి చెప్పింది.

ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు తమపై ప్రబలుతున్న వ్యతిరేకతను కవర్ చేసుకోవడానికి ఫేక్ ఫొటోలను వాడుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో చూడండి అంటూ.. తెలుగుదేశం పార్టీ అనుకూలురులు ఫేస్ బుక్ లో ప్రచారానికి పెట్టిన ఫొటో అసలు గుట్టు బయటపడింది. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడని, మూడేళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. అంచనాల పెంపుతో దోపిడీనే తప్ప అంతకు మించి సాధిస్తున్నది ఏమీ లేదని స్ఫష్టం అవుతోంది.

అయితే ఈ విషయం ప్రజలకు అర్థం కానీయకుండా చేయడానికి తెలుగుదేశం పార్టీ ఫేక్ ఫొటోలను నెట్ లో పెడుతోంది. పనులు శరవేగంగా జరుగుతున్నట్టుగా ఒక ఫొటోను నెట్ లో పెట్టారు. అయితే అది వాస్తవానికి పోలవరం ఫొటో కాదు. ఎక్కడో చైనాలో ఒక ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఫొటో. దాన్ని చూపించి.. పోలవరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం అవుతోందని, అద్భుతం జరుగుతోందని తెలుగుదేశం అనుకూలురు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే అది ఫేక్ ఫొటో అని స్పష్టం అవుతోంది. చైనాకు సంబంధించిన ఫొటోను పోలవరం పనులకు సంబంధించిన ఫొటోగా చూపుతూ తెలుగుదేశం వారు ప్రచార ఆర్భాటానికి ఒడిగట్టారని స్పష్టం అవుతోంది. చేసేది లేక ఈ ఫేక్ పనులతో తెలుగుదేశం ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE