టీడీపీకి షాక్.. మరో ముఖ్య నేత వైఎస్సార్సీపీలోకి..!

Updated By VankayaTue, 04/17/2018 - 13:06
ysrcp

తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మరో ముఖ్య నేత చేరుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టినప్పటి నుంచి పలువురు తెలుగుదేశం నేతలు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ పరంపర కొనసాగుతూ ఉంది. జగన్ విజయవాడలోకి అడుగుపెట్టగానే మాజీ ఎమ్మెల్యే, కమ్మ సామాజికవర్గానికి చెందని యలమంచిలి రవి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ జాబితాలో ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి కూడా చేరినట్టుగా కనిపిస్తున్నాడు. 

కాంగ్రెస్ పార్టీని వీడి కొన్నాళ్ల కిందట ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. జగన్ ను విమర్శించేందుకు పనికొస్తారు అని చంద్రబాబు వీరికి పచ్చకండువా అయితే వేశాడు. అయితే.. టీడీపీలోకి చేరిన కొన్నాళ్లే ఆనం బ్రదర్స్ కు అసలు విషయం అర్థం అయిపోయింది. తమను చంద్రబాబు వాడుకుంటున్నాడు తప్ప అంతకు మించి తమకు ప్రాధాన్యత ఉండదనే క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి తెదేపాను వీడటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఆనం రామనారాయణ రెడ్డి మాజీ మంత్రి అని వేరే చెప్పనక్కర్లేదు. వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశాడు, కిరణ్ కేబినెట్ లో కూడా చేశాడు. అయితే చంద్రబాబు మాత్రం ఎలాంటి ప్రాధాన్యతనూ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రామనారాయణరెడ్డి టీడీపీని వీడనున్నాడని వైఎస్సార్సీపీలోకి చేరనున్నాడని తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రామనారాయణరెడ్డి వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరిగాయని.. అతి త్వరలో ఈయన వైసీపీలోకి చేరడం ఖాయమని తెలుస్తోంది.
ఆనం సోదరుల్లో ఇప్పటికే ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్నారు.

ఇక ఆనం వివేకానందరెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు వివేకను పరామర్శించడానికి వెళ్లినప్పుడు కూడా రామనారాయణరెడ్డి అక్కడ లేరు. అలాగే తన కార్యాలయం నుంచి చంద్రబాబు ఫొటోలను కూడా తీసేయించాడట రామనారాయణరెడ్డి. త్వరలోనే జగన్ ను కలిసి ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టుగా తెలుస్తోంది.
 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE