జోరు మీదున్న జగన్.. టీడీపీలో అలజడి..!

Updated By VankayaWed, 02/14/2018 - 13:55
YS Jagan

రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన రాజీనామాల ప్రకటన తెలుగుదేశం పార్టీలో అలజడి పుట్టిస్తోంది. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయం పై చర్చ కాక మీదకు వచ్చినప్పుడు జగన్ మోహన్ రెడ్డి రాజీనామాల అస్త్రాన్ని సంధించాడు. గడువు తేదీ ప్రకటించి.. ఆ లోగా ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే.. రాజీనామాలు అని జగన్ ప్రకటించారు. ఏప్రిల్ ఆరో తేదీని చివరి తేదీగా ప్రకటించాడు వైకాపా అధినేత. మరోవైపు వైకాపా ఎంపీలు కూడా సై అంటున్నారు. రాజీనామాలకు గర్వ పడుతున్నాం అని వారు అంటున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గొంతులో పచ్చి వెలగకాయ పడినట్టుగా అయ్యింది పరిస్థితి. ఎలా స్పందించాలో టీడీపీకి అర్థం కావడం లేదు. జగన్ పై ఎదురుదాడి అయితే చేస్తూ ఉన్నారు. జగన్ వి డ్రామాలు అని అంటున్నారు. అయినా.. జగన్ డేర్ గా రాజీనామా అంటుంటే.. టీడీపీ మాత్రం అలాంటి పని చేయలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది టీడీపీ. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా టీడీపీ బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నిరసనలు తెలుపుతాం, ధర్నాలు చేస్తాం అంటున్నారు కానీ.. ఎన్డీయేలోనే ఉండి ఏం చేసినా ప్రయోజనం ఉండదు.

ఇక చేసేది లేనట్టుగా తెలుగుదేశం వాళ్లు జగన్ పై ధ్వజమెత్తుతూ ఉన్నారు. జగన్ వి డ్రామాలు అని అంటున్నారు. ఎన్డీయేలో కూర్చుని తెలుగుదేశం ఇలా మాట్లాడితే.. తన తోకకు తాను నిప్పు పెట్టకున్నట్టే. తెలుగుదేశం పార్టీ వాళ్లకు రాజీనామాలు చేసే ధైర్యం కనిపించడం లేదు. కేంద్ర మంత్రులు అడ్రస్ లేరు. వారు మీడియా ముందుకే రావడం లేదు. అంతే కాదు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా మీడియా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ డేర్ గా చేసిన ప్రకటనతో.. తెలుగుదేశం మరింత ఇరకాటంలో పడిపోయింది. పరిస్థితి చల్లారిపోతుంది.. తాము ఎన్డీయేలో కొనసాగినా ఇబ్బంది లేదు అని లెక్కలేసిన టీడీపీ అంచనాలు అన్నీ అడ్డం తిరిగాయి. ఇక చంద్రబాబు చేయగలిగింది కూడా ఏమీ లేదేమో!

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE