టీడీపీ.. చేజేతులారా నష్టం చేసుకుంటోందా?

Updated By VankayaMon, 04/16/2018 - 16:28
TDP will loss in his own strategies

రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, కేంద్ర రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ ఒకదానిపై మరోటి ఆధారపడే ఉంటాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీపై వ్యతిరేకత ఏర్పడితే, అది రాష్ట్రంలోని అధికార పార్టీపై కూడా ఉంటుంది. ఇక రాష్ట్రంలోని అధికార పార్టీపై వ్యతిరేకత ఉంటే అది కేంద్రంలోని పార్టీపై కూడా పడుతుంది. ఇలా వ్యతిరేకత అయినా, అనుకూలత అయినా పరస్పరం పంచుకుంటాయి అధికార పార్టీలు. ఇంత వరకూ ఏపీ రాజకీయ చరిత్ర చెబుతున్నది ఇదే మాట.

ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ గ్రహించడం లేదు. ఇప్పుడు మోడీ వ్యతిరేకతను పెంచాలని తెలుగుదేశం భావిస్తోంది. మోడీ మోసం చేశాడు అని చంద్రబాబు ఒకటికి వెయ్యి సార్లు అంటున్నాడు. అయితే అలా అనడం ద్వారా ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేలే చేస్తున్నాడు. రేపు ఎన్నికలు అయ్యాకా.. కాంగ్రెస్, బీజేపీల్లో బాబు ఛాయిస్ కచ్చితంగా బీజేపీనే అవుతుందని వేరే చెప్పనక్కర్లేదు. అలా కాదు, వైసీపీ, బీజేపీ దోస్తులు అని తెలుగుదేశం ప్రచారం చేస్తున్నా..ఇది అంతగా జనాల్లోకి వెళ్లలేదు, వెళ్లదు కూడా.

ఇక ఎన్నికలు అయ్యాకా తను కాంగ్రెస్ వైపు వెళ్తాను, బీజేపీతో కలవను అని చంద్రబాబు ధైర్యంగా ప్రకటించలేడు. అలా ప్రకటిస్తే నష్టపోయేది ఆయనే. ఇక మూడో ఫ్రంటు ఇప్పట్లో కుదిరే పనిలా కనిపించడం లేదు. 
ఇలాంటి పరిస్థితుల నడుమ చంద్రబాబు నాయుడు బీజేపీపై విమర్శలు చేస్తున్నాడు. మోడీపై వ్యతిరేకతను పెంచుతున్నాడు. ఇది పెరిగినంతా.. తెలుగుదేశానికే నష్టం. కేంద్రంలో బీజేపీ అధికారం చేజిక్కించుకున్నప్పుడల్లా ఏపీలో టీడీపీ అధికారం పొందింది. కేంద్రంలో బీజేపీ దెబ్బతిన్నప్పుడల్లా ఏపీలో టీడీపీ దెబ్బతింది. ఇదీ చరిత్ర. ఇప్పుడు బీజేపీని దెబ్బతీయాలని చంద్రబాబే ప్రయత్నిస్తున్నాడు. ఇది తమ తోకకు తామే నిప్పు పెట్టుకోవడమే!

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE