శ్రీవారి ఆల‌యాన్ని స్థాపించింది ఎవ‌రంటే

Updated By VankayaMon, 04/16/2018 - 15:25
Tirumala Tirupati Temple

రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త . కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపించాల్సిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ రామానుజాచార్యుడి వ‌ల్లే శ్రీవారి ఆల‌య నిర్మాణానికి బీజం ప‌డిన‌ట్లు చ‌రిత్ర కారులు చెబుతున్నారు. 

పెరుంబుదూరులో కేశవ సోమయాజి దీక్షితార్ - కాంతిమతిలు దంప‌తులు. వీరిద్ద‌రు సంతానం కోసం ఎన్నో యాగాలు చేసి ఫ‌లితం రాలేదు. దీంతో పెరుబుదూరు ను విడిచి తిరువళ్ళిక్కేణి  ఒడ్డున ఉన్న పార్థసారథి స్వామి దేవాలయంలో యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాలతో స్వామివారిని మెప్పించి  స్వామి అనుగ్రహం వల్ల రామానుజాచార్యుడికి  జ‌న్మ‌నిచ్చారు. అంతటి గొప్ప మహిమాన్నితుడైన రామానుజాచారుడ్యుడి వ‌ల్లే శ్రీవారి ఆల‌యం స్థాపించిన‌ట్లు తెలుస్తోంది. 

తిరుమ‌ల కొండ‌కింద గోవిందరాజస్వామి ఆల‌యాన్ని క‌ట్టించ‌డంలో రామానుజాచార్యుడి పాత్ర ఉంది. అయితే రామానుజాచార్యుడు త‌న శిష్యుడు యాద‌వ‌రాజును ప్రోత్స‌హించి చెరువు ప‌క్క‌న శ్రీవారి ఆల‌యాన్ని ప్రారంభించేలా చేశారు. యాద‌వ‌రాజు త‌న గురువు రామానుజులు మాట ప్ర‌కారం దేవ‌ల‌యాన్ని నిర్మించాడు. ఆ నిర్మాణం త‌రువాత నిర్మించిన అగ్ర‌హారానికి  తన గురువు పేరిట రామానుజపురం అని నామకరణం చేశారు.  

అలా స్థాపించిన శ్రీవారి ఆల‌యాన్ని ఈస్టిండియా కంపెనీ ఆధీనంలోకి తీసుకొని కార్య‌క‌లాపాల్ని కొనసాగించింది. అలా 1843 లో ఈస్టిండియా కంపెనీ క్రైస్తవేతర, స్థానికుల ప్రార్థనా స్థలాల యాజమాన్యాన్ని విడిచిపెట్టింది. వేంకటేశ్వరస్వామి ఆలయం, జాగీర్ల నిర్వహణ తిరుమలలోని హాథీరాంజీ మఠానికి చెందిన సేవదాస్‌జీకి అప్పగించారు. 1933 వరకు ఒక శతాబ్దం పాటు ఆలయ నిర్వహణ మహంతుల చేతిలో ఉంది.

అదే సంవ‌త్స‌రంలో అంటే 1933 లో మద్రాస్ అసెంబ్లీ ఆల‌య నిర్వ‌హ‌ణ‌ను "తిరుమల తిరుపతి దేవస్థానం అనే ( టీటీడీ ) సంస్థ‌ను  ఏర్పాటు చేసింది.  ఆ త‌రువాత 1951లో ఈ చట్టాన్ని మార్చి టీటీడీ నిర్వహణను  ధర్మకర్తల సంఘానికి అప్పగించి, నిర్వహణాధికారిని ప్రభుత్వం నియమించేలా ఇంకొక చట్టం చేసింది.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE