కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ల‌డ్డూ విశిష్ట‌త

Updated By VankayaMon, 04/16/2018 - 14:46
Tirumala venkateswara swami  Laddu information

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం రోజూ కొన్ని వేలమంది తిరుమల వెళ్తుంటారు. తిరుమల లో  తలనీలాలు సమర్పించడం, దేవుడ్ని దర్శించుకోవడం, లడ్డూలు కొనుక్కోవడం తిరిగిరావడం చాలామంది ఈ మూడిటికే ప్రాధాన్యత ఇస్తారు. 

వీటిలో శ్రీవారి ల‌డ్డూకు విశిష్ట‌మైన ప్రాదాన్య‌త ఉంది. తిరుమ‌ల తిరుప‌తి అంటే ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది. వెంక‌న్న ఆ త‌రువాత ఆయ‌నకు ప్ర‌సాదంగా స‌మ‌ర్పించే ల‌డ్డూ. శ్రీవారికి అత్యంత ప్ర‌తీపాత్ర‌మైన ప్ర‌సాదం అంటే లడ్డు. అందుకే ద‌ర్శ‌నార్ధం వ‌చ్చే భ‌క్తులు ల‌డ్డును స్వీక‌రించ‌కుండా వెనుదిర‌గ‌రు. 

క్రీ.శ.1536లో తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు తిరుమలలో శ్రీవారికీ, శ్రీదేవి భూదేవిలతో కళ్యాణోత్సవంలో ల‌డ్డును ప్రవేశపెట్టించాడని ప్ర్రతీతి. నాటి నేటి వ‌ర‌కు ల‌డ్డుకు ఉన్న ప్రాముఖ్య‌త ద‌శ‌దిశ‌లా వ్యాప్తి చెందింది. ప‌దిహేనేళ్ల క్రితం శ్రీవారి ల‌డ్డూలు ఎన్నికావాలంటే అన్ని ల‌భించేవి. రానురాను భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా ల‌డ్డూల పంపిణీ చేయ‌డంలో తిరుమ‌ల‌తిరుప‌తి దేవ‌స్థానం త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. 

అంతేకాదు ఒక ప్రాంతంలో తయారయ్యే వస్తువులకు, ఉత్పత్తులకు జీయోగ్రాఫికల్ ఇండిగేషన్ రిజిష్ట్రీ గుర్తింపునిస్తుంది. అలాంటి గుర్తింపు ప్రపంచ చరిత్రలోనే ఒక హిందూ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన  శ్రీవారి లడ్డూకు లభించ‌డం గ‌మ‌నార్హం. అంత‌టి చ‌రిత్ర గ‌డించిన ఈ ల‌డ్డూను ర‌క‌ర‌కాల ప‌ద్ద‌తుల్లో త‌యారు చేసి భ‌క్తుల‌కు అందిస్తారు. ఈ త‌ర‌హాలో ల‌డ్డూల‌ను త‌యారు చేయాల‌ని చాలా సంస్థ‌లు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాయి. 

 ఇక కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం ప్రారంభమై 2015 ఆగ‌స్టు నెల‌లో 300వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టింది. ఈ లడ్డూ తయారీలో శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు. 

లడ్డూ తయారు చేయడానికి వాడె సరుకుల మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు.ఈదిట్టం స్కేలును 1950లో మొదట రూపొందించగా భక్తులతాకిడిని బట్టి దీనిని 2001లో సవరించారు. శ్రీవారి లడ్డూ తయారిలో వాడే దిట్టంలో వాడే సరుకులు దీని ప్రకారం 5100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు. 
ఆవు నెయ్యి - 165 కిలోలు
శెనగపిండి - 180 కిలోలు
చక్కెర - 400 కిలోలు
యాలుకలు - 4 కిలోలు
ఎండు ద్రాక్ష - 16 కిలోలు
కలకండ - 8 కిలోలు
ముంతమామిడి పప్పు -30 కిలోలు . ఈ మిశ్రమంలో సుమారు 5,100 లడ్డూలు వరకూ తయారవుతాయి. ఇలా టీటీడీ రోజుకు మూడు లక్షల లడ్డుల‌ను అందుబాటులో ఉంచుతుంది. తిరుమలలో 270మంది వంటవారితో సహా మొత్తం 620మంది లడ్డూ ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉంటారు. బూంది క్రేట్స్ ను లడ్డులను మోసుకుపోయెందుకు రెండు ఎస్కలేటర్లు ను ఏర్పాటు చేసారు. ఈ ఎస్కలేటర్లు రోజుకు 8లక్షల లడ్డులను తీసుకుపోయే సామర్ధ్యం కలిగి ఉన్న‌ట్లు టీటీడీ ఆల‌య అధికారులు చెబుతున్నారు

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE