టాలీవుడ్ సంబంధాలు - స్పెషల్ స్టొరీ

Updated By VankayaMon, 04/16/2018 - 15:11
Tollywood casting couch

మానవ సంబంధాలు చాలా సున్నితమైనవి. ఒక్క చిన్న అపార్థానికో లేక మరో కారణానికో విడిపోవడం మనకు కొత్తేమి కాదు. రోజుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల ప్రేమ జంటలు దంపతులు గొడవలు పడి విడిపోతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న చర్చ కామం, లోబరుచుకోవడం, శారీరక వాంఛ తీర్చుకోవడం గురించి. ఇక్కడ వంద శాతం మంచి వారు ఉండరు. ఇక్కడే కాదు ఎక్కడా ఉండరు. గాంధి, నెహ్రు మీద ఇప్పటికీ విమర్శనాస్త్రాలు వేసేవాళ్ళు చాలా ఉన్నారు. ఫోటోలతో సహా సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తూ ఉంటారు. కాని కొంచెం లోతుగా గమనిస్తే ఇక్కడ సంబంధాలు అన్ని చోట్ల లాగే ఎంత సున్నితంగా ఉన్నాయో అర్థమవుతుంది. అవేంటో చూద్దాం

1.       ఒక స్టార్ హీరో వారసుడు మరో అగ్ర నిర్మాత కూతురిని పెళ్లి చేసుకున్నాడు. కొడుకు పుట్టాడు. ఎంతో కాలం వారి దాంపత్యం నిలవలేదు . ఫలితం విడాకులు. తనతో నటించే అమ్మాయిని ఈ హీరో ప్రేమ వివాహం చేసుకున్నాడు. మరో మగ సంతానం. ఇప్పుడు ఇద్దరూ చేతికి వచ్చి హీరోలయ్యారు. మొదటి కొడుకు పెళ్లికి అందరు కలిసినట్టుగా కనిపించినా లోగుట్టు అందరికి తెలిసిందే

2.       ఆయనో పెద్ద హీరో. మూడు వందల సినిమాల్లో నటించిన ఘనత. మొదటి భార్య ద్వారా ఇద్దరు మగ సంతానం,ఒక అమ్మాయి. దాంపత్యం తర్వాత పొసగలేదు. తనతో పాటు సినిమాల్లో నటించిన హీరొయిన్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడకు కూడా మొదటి భర్త ద్వారా అప్పటికే ఒక కొడుకు ఉన్నాడు. ప్రేమ పండి పెళ్లి చేసుకున్నారు. అందరు పరిశ్రమలోనే ఉన్నారు.

3.       తెలుగు తెరవేల్పుగా భావించే మహానటుడు రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి అయిన చరిత్ర కలిగిన ఆయన ఆరు పదుల వయసులో రెండో పెళ్లి చేసుకోవడం కుటుంబంలో ఎన్నో వివాదాలు రేపింది. ఆవిడకు అప్పటికే మొదటి భర్త ద్వారా చేతికి అందివచ్చిన అమ్మాయి ఉంది. ఆయన జీవితంలో ఈ మచ్చ పోయే దాకా వెంటాడుతూనే ఉంది

4.       క్రేజ్ కి పర్యాయపదంగా ఉండే మరో హీరో.  మొత్తం మూడు పెళ్ళిళ్ళు. మొదటి భార్య విడాకుల విషయం పెద్ద రభస జరిగితే సెటిల్ చేసుకోవడానికి కోట్ల రూపాయల భరణం చెల్లించారని అప్పట్లో గట్టిగానే వినిపించింది. రెండో భార్య ద్వారా కొడుకు కూతురు. ఇప్పటికీ పిల్లలు టచ్ లో ఉన్నా భార్య భర్త కలవరు. మూడో భార్య విదేశీ వనిత. ఒక పాప, ఒక బాబు సంతానం.

5.       అప్పట్లో అతను ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఒక లేడీ స్టార్ కమెడియన్ ని ప్రేమించాడు. వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. ఆ తర్వాత చెడిపోయింది.కట్ చేస్తే యాభై ఏళ్ళు దాటినా అతనికి పెళ్లి కాలేదు. ఆవిడను కదిపితే అతని మోసాల గురించి కథలు కథలుగా చెబుతుంది

6.       80 దశకంలో తక్కువ సమయంలో అగ్ర స్థానానికి చేరుకున్న ఒక హీరోకు వయసులో చాలా చిన్నదైనా తల్లి పాత్రలు వేసుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో మంచి సాన్నిహిత్యం ఉండేదని అప్పట్లో గట్టి చర్చలే జరిగేవి. తెరమీద వారు వేసే పాత్రలకు బయట వాళ్ళకు ఉన్న సంబంధానికి అసలు పొంతనే ఉండదని టాక్ ఉంది

7.       అతను యంగ్ హీరో. ఒక ప్రఖ్యాత నటుడికి మనవడు. పరిశ్రమలో రాజకీయాల్లోనూ నాన్నకు మంచి పేరుంది. కాని బాబాయ్ చేరదీయడు. దగ్గరకి తీసుకునే ప్రయత్నాలు చేయడు గాక చేయడు. కారణం అతను తన తండ్రికి నిజమైన మనవడు కాదు అనేది అతని అభిప్రాయమట

8.       బ్లాక్ అండ్ వైట్ కాలంలో గొప్ప నటిగా వెలిగిన ఓ నట దిగ్గజం అప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకుని స్త్రీలోలుడిగా పేరున్న వాడిని కోరి మరీ పెళ్లి చేసుకుంది. చివరికి తన ఆస్తులన్నీ కోల్పోయి మందుకు బానిసగా మారి చాలా దీన స్థితిలో కన్ను మూయాల్సి వచ్చింది

9.       ఒక్క సినిమాతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరొయిన్ గా టాప్ రేంజ్ కి వెళ్ళిపోయినా బెంగాలి భామ ఒక కుర్ర హీరో ప్రేమలో పడింది. అతను పీకల్లోతు దాకా తీసుకెళ్ళి తర్వాత నో అన్నాడు. అగ్ర హీరోల సరసన ఇండస్ట్రీ హిట్స్ లో నటించిన ఆ హీరొయిన్ ఓసారి ఆత్మహత్య ప్రయత్నం చేసి చివరికి చాలా దయనీయ స్థితిలో కన్ను మూసింది. ఆ హీరో కెరీర్ నాశనం అయిపోయి పబ్ బిజినెస్ చేసుకుంటున్నాడు

10.   ఓ స్టార్ హీరో కూతురిని ప్రేమించాడు ఒక యూత్ హీరో. కాని పెళ్లి పీటల దాకా తీసుకెళ్లలేకపోయాడు. వేరే అమ్మాయిని చేసుకుని సినిమాల్లో అవకాశాలు కోల్పోయి చివరికి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలేసాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ లో నిజమైన కథలు చాలానే ఉన్నాయి. సంబంధాలు ఇక్కడ ఎంత సున్నితంగా ఉంటాయో దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇవి అన్ని చోట్ల ఉండేవే కాని గ్లామర్ ఆధారిత పరిశ్రమ కాబట్టి ఇక్కడ ఆకర్షణ ఎక్కువ.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE