డ్రగ్స్ మత్తు కోసం తారల షిఫ్టింగ్ ప్లాన్

Updated By VankayaTue, 01/02/2018 - 18:55
tollywood-stars-shifting-plan-drugs

ఆ మధ్య టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు చేసిన రచ్చ అందరు మర్చిపోయారు కాని దాని తాలూకు ప్రబావం మాత్రం ఇంకా  బలంగానే ఉంది. గతంలో లాగా విచ్చలవిడిగా డ్రగ్స్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వాడే అవకాశం ఇప్పుడు జంట నగరాల్లో బాగా తగ్గిపోయింది. కారణం నిఘా. ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం నుంచి అధికారికంగా కాకపోయినా మౌఖికంగా ఈ ఇష్యూ గురించి ఇంకా హై లైట్ చేయకండి అని ఆదేశాలు వచ్చినందునే సెకండ్ రౌండ్ ఇన్వెస్టిగేషన్ ఇంత వరకు మొదలు పెట్టలేదు అనే వార్త ఇప్పటికే ప్రచారంలో ఉంది.

అందుకే సినిమా తారలు డ్రగ్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి కొత్త దారులు వెతుకుతున్నారట. అదే విదేశీ ప్రయాణం. ఇందులో మెజారిటీ సినిమా షూటింగ్ పేరుతో అక్కడికి వెళ్లి జల్సా చేస్తున్నారని, ఇక్కడ షూట్ చేసినా సరిపోయే వాటిని రిచ్ నెస్ పేరుతో కావాలనే నిర్మాత డబ్బుతో అక్కడ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక సినిమా ప్రముఖుడు కామెంట్ చేయటం గమనార్హం. బ్రెజిల్, మెక్సికో, బ్యాంకాక్, మకావ్ తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా మన వాళ్ళు డ్రగ్స్ నిషాలో మునిగి తెలుతున్నారట.

 

ఇందులో చాలా మటుకు సమాచారం సిట్ మొదటి సారి 13 మంది టాలీవుడ్ ప్రముఖులతో జరిపిన విచారణలో బయట పడిందట. కాని డ్రగ్స్ విదేశాల్లో తీసుకుంటే ఇక్కడ చర్య తీసుకోవడానికి అవకాశం లేదు అనే భ్రమలో ఇదంతా చేసినట్టు టాక్. అందుకే ఇలా బయట ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నామని ఒక హీరో చెప్పినట్టు తెలిసింది. అయినా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ మాకుందని, అనవసరంగా రచ్చ చేయకండి అని సిట్ అధికారులతో సదరు హీరో అన్నట్టు సమాచారం. చిల్ ఔట్ పేరుతో స్వంత డబ్బులతో బయటికి వెళ్తున్న వాళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు.

ముఖ్యంగా ఎల్ఎస్డి(లిసర్జిక్ యాసిడ్ డైధైల్మెట్)ని తీసుకుంటే దాదాపు 18 గంటల పాటు నిషాలో మునిగి తేలవచ్చట.దానికి ఎడిక్ట్ అయిన వాళ్ళ సంఖ్యా పదుల్లో ఉందట. చిల్ అవుట్ అనే పదాన్ని డిపార్టుమెంటు గుర్తించడంతో దాన్ని హ్యాపీ ట్రిప్ గా పేరు మార్చి వెళ్తున్నారని తెల్సింది. బ్రెజిల్, మాకావ్ లాంటి చోట్ల డ్రగ్స్ వాడకం పెద్ద నేరమేమి కాదు. అక్కడ తీసుకుంటే ఇక్కడ విచారణ ఏంటి అని అడిగిన ఒక ప్రముఖుడిని చట్టంలో ఒక క్లాజ్ చూపించి మరీ నోరు మూయించారని తెలిసింది. ఇండియన్ సిటిజెన్ ఎక్కడ డ్రగ్స్ వాడినా కల్గినా చట్టరీత్యా నేరమే అనే పాయింట్  చూపించాకే అతను సైలెంట్ అయ్యాడట. సో ఇదండీ మనవాళ్ళు డ్రగ్స్ కోసం వేసుకున్న షిఫ్టింగ్ మాస్టర్ ప్లాన్.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE