కన్నడ హీరోతో టాప్ హీరోయిన్ ఎఫైర్

Updated By VankayaFri, 06/08/2018 - 10:14
Top heroine affair with kannada hero

కాదేది ప్రేమకు అనర్హం అని ఊరికే అనలేదు. తమకు తగ్గ జోడి అనిపిస్తే దేశం, రాష్ట్రం, కులం, మతం ఇవేవి పట్టించుకుపోవడం లేదు మన హీరోయిన్లు. శ్రేయ, అమీ జాక్సన్, రాధికా ఆప్టే, శృతి హాసన్ వీళ్లంతా విదేశీయలనే పెళ్లి చేసుకున్న లేదా  ప్రేమలో ఉన్నవాళ్లు. ఇదంతా ఓపెన్ సీక్రెట్. మీడియాలో హై లైట్ అవుతున్నామని తెలిసినా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా హ్యాపీగా కొనసాగిస్తున్నారు. కానీ వీళ్లందరిలో ఉన్న కామన్  ఫాక్టర్ ఏంటంటే ఎవరూ  ప్రస్తుతం టాప్ రేంజ్ లో లేకపోవడం.

అందుకే స్వేచ్ఛగా ఉన్నారు. కానీ ఒక స్టార్ హీరొయిన్ మాత్రం తాను ఇంకా ఫామ్ లో ఉన్న కారణంగా తన ప్రేమను బయట పెట్టుకోవడం లేదు. నార్త్ నుంచి వచ్చి ఇక్కడ బాగా సెటిల్ అయిపోయిన సదరు స్టార్ ప్రస్తుతం మరీ ఎక్కువ సినిమాలు చేయటం లేదు కానీ అడపాదడపా ఒకటిరెండుతో పాటు ఐటెం సాంగ్స్ కి కూడా సై అంటోంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ ఓ కన్నడ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉందట. 

సదరు హీరో అక్కడ స్టారే. కాకపోతే ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు. తనకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఇది బయట పెడితే నాన్నతో పాటు కుటుంబానికి కూడా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో సీక్రెట్ గా ఉంచుతున్నాడట. వీలు దొరికినప్పుడంతా బెంగుళూరు కాకుండా బయటికి వెళ్లి చెట్టాపట్టాలు వేసుకుని షికారు చేస్తున్నట్టు సమాచారం. ఆ మధ్య కర్ణాటక సీఎం రెండో భార్య విషయం రచ్చ జరిగిన నేపథ్యంలో ఎందుకొచ్చిన రిస్క్ అని జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది.

ఒకవేళ ప్రేమ ఇలాగే కొనసాగి ఇక సినిమా అవకాశాలు రావు అని ఫిక్స్ అయినప్పుడు తమ ప్రేమ కథను విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యిందట ఈ జంట. మొత్తానికి కన్నడ హీరో ఘటికుడే. ఎక్కడో సౌత్ నుంచి వచ్చి టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన హీరోయిన్ ని శాండల్ వుడ్ కు చెందిన తాను లైన్ వేయటం అంటే చిన్న విషయం  కాదుగా. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE