శ్రీరెడ్డి గురించి వరుణ్, సంపూ

Updated By VankayaTue, 04/17/2018 - 12:38
Varun Tej And Sampoornesh babu

నిన్న పవన్ కళ్యాణ్ గురించి శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో రేపిన కాక అంతా ఇంతా కాదు. దీని గురించి టాలీవుడ్ పెద్దల మధ్య సైతం చాలా తీవ్ర చర్చ జరుగుతోంది. పోనీలే అని జాలి చూపించిన పాపానికి ఇప్పుడు అకారణంగా స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ  పిచ్చి వాగుడు చేస్తున్న శ్రీరెడ్డికి మీడియా అనవసర సపోర్ట్ ఇబ్బందిగా మారింది.

కేవలం రేటింగ్స్ పెంచుకోవడమే లక్ష్యంగా ఉన్న ఛానల్స్ తనకు మితిమీరిన ప్రాధాన్యత ఇవ్వడం వల్లే పరిస్థితి ఇంత దాకా వచ్చింది. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ దీని గురించి పరోక్షంగా స్పందించాడు. తన ట్విట్టర్ లో మెసేజ్ పోస్ట్ చేసిన వరుణ్ తేజ్ అందులో నీచ మనస్కుల గురించి పట్టించుకొనవసరం లేదని వాళ్ళ ఉత్సాహమంతా ఎదుటివాళ్ళను తప్పుగా చూపించడంలోనే ఉంటుందని పేర్కొన్నాడు.

ఇక కామెడీ స్టార్ సంపూ కూడా దీనికి రెస్పాండ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ తల్లిని నిందించడం తనకు బాధ కలిగిస్తోందని సాటి మహిళను గౌరవించలేని ఈ పోరాటానికి అర్థం లేదని చెబుతూ శ్రీరెడ్డి కామెంట్స్ ని ఖండించాడు. జనసేన సపోర్టర్ వింగ్ కూడా స్పందించింది. సాధారణ మహిళలు కనీసం వినడానికి కూడా ఇష్టపడని మాటలో ఒక తల్లిని తూలనాడిన ఆమె ఈ మాట అనవచ్చో లేదో ఒకసారి తన తల్లితో మాట్లాడి ఉంటే బాగుండేదని గట్టి చురకే వేసింది. మొత్తానికి తన మీద ఉన్న మద్దతును పూర్తిగా వ్యతిరేకత రూపంలో మార్చుకున్న శ్రీరెడ్డి మీద జాలి చూపించిన వారు సైతం మొహం తిప్పేసుకుంటున్నారు. నిన్న మద్దతుగా ప్రెస్ మీట్ కు వచ్చిన నాయకులు, మహిళా సంఘాల సభ్యులు అందరు ఈ వీడియో బయటికి వచ్చినప్పటి నుంచి కనిపిస్తే ఒట్టు.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE